థియేటర్లలో సినిమాల జోరు ఓ రేంజ్‌లో ఉంటే.. OTTలో మాత్రం ప్రతి వారం కొత్త కంటెంట్‌తో స్ట్రీమింగ్ జాతర నడుస్తూనే ఉంది. ఈ వీకెండ్ కూడా OTT లవర్స్‌కి కంటెంట్ కొదవ లేదు. సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు తెలుగు సినిమాలతో పాటు హిందీ, తమిళ, మలయాళ సినిమాల తెలుగు డబ్బింగ్ వెర్షన్లు, క్రైమ్ థ్రిల్లర్స్, హారర్, యాక్షన్, రొమాన్స్, కోర్ట్‌రూమ్ డ్రామాలు, రియాలిటీ షోలతో OTT ప్లాట్‌ఫామ్స్ రెడీ అయ్యాయి. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5లో ఈ వారం చెప్పుకోదగ్గ కంటెంట్ లైనప్ ఉంది. మరి వీకెండ్‌లో ఏం చూడాలి? ఏ సినిమా ఏ OTTలో ఉంది? కథేంటి? ఎప్పటి నుంచి స్ట్రీమింగ్? అనేది తెలుసుకుందాం.
ఇరుముడి
తెలుగులో రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఇరుముడి’ ఇప్పటికే Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్ కలిసిన కథగా ఈ సినిమా తెరకెక్కింది. కూతురి కోరికను నెరవేర్చేందుకు తండ్రి చేపట్టే ఓ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రయాణం.. ఆ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లు.. కుటుంబ బంధాల్లో వచ్చే మార్పుల చుట్టూ కథ తిరుగుతుంది.
OTT: Netflix
స్ట్రీమింగ్: సెప్టెంబర్ 18 నుంచి
జానర్: ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్
‘మొదటి రాత్రి’
తమిళం నుంచి వచ్చిన తెలుగు డబ్బింగ్ కామెడీ థ్రిల్లర్ ‘మొదటి రాత్రి’ కూడా ఈ వీకెండ్ లిస్ట్‌లో ఉంది. పెళ్లి రాత్రి చుట్టూ జరిగే అనూహ్య పరిణామాలు, కామెడీ, సస్పెన్స్ కలిపి ఈ సినిమా సాగుతుంది. తమిళ సినిమాలను తెలుగు డబ్బింగ్‌లో చూడాలనుకునే వారికి ఇది మరో OTT ఆప్షన్.
OTT: Netflix
భాష: తమిళం + తెలుగు డబ్
జానర్: కామెడీ, థ్రిల్లర్
లస్ట్ స్టోరీస్ 3
రిలేషన్‌షిప్స్, లవ్, ఎమోషన్స్, హ్యూమన్ బిహేవియర్ చుట్టూ సాగే ఆంథాలజీ ‘Lust Stories 3’ కూడా Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. వేర్వేరు కథలు, వేర్వేరు క్యారెక్టర్స్, వేర్వేరు రిలేషన్‌షిప్ యాంగిల్స్‌తో తెరకెక్కిన ఈ ఆంథాలజీ అడల్ట్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తుంది. హిందీతో పాటు తెలుగు డబ్బింగ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
ALSO READ : స్టార్ సిస్టర్స్ మధ్య ఆస్తి వివాదం.. అక్కపై చెన్నై పోలీస్ కమిషనరేట్‌లో రాధ ఫిర్యాదు!
OTT: Netflix
భాష: హిందీ + తెలుగు డబ్
స్ట్రీమింగ్: సెప్టెంబర్ 18 నుంచి
జానర్: ఆంథాలజీ, రిలేషన్‌షిప్ డ్రామా
షాక్: ట్రస్ట్ నో వన్
ఈ వీకెండ్‌లో కొత్తగా స్ట్రీమింగ్ కానున్న క్రైమ్ థ్రిల్లర్ ‘Shaque: Trust No One’. పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ సెప్టెంబర్ 24 నుంచి Netflixలోకి వస్తోంది. తొమ్మిదేళ్లుగా కనిపించకుండా పోయిన కూతురి కోసం ఓ తల్లి వెతకడం.. ఆ అన్వేషణలో బయటపడే షాకింగ్ నిజాలు.. కుటుంబ సభ్యులపైనే అనుమానాలు రావడం.. ఇలా కథ మొత్తం “ఎవరిని నమ్మాలి?” అనే ప్రశ్న చుట్టూ తిరుగుతుంది.
OTT: Netflix
స్ట్రీమింగ్: సెప్టెంబర్ 24
జానర్: క్రైమ్ థ్రిల్లర్
కాస్ట్: పరిణీతి చోప్రా, జెన్నిఫర్ వింగెట్, తాహిర్ రాజ్ భాసిన్
తుడక్కమ్
మలయాళం నుంచి వచ్చిన ‘తుడక్కమ్’ యాక్షన్, సర్వైవల్ థ్రిల్లర్. మార్షల్ ఆర్ట్స్, యాక్షన్ బ్లాక్స్‌తో పాటు సర్వైవల్ ఎలిమెంట్స్ ఈ సినిమాకు హైలైట్. మలయాళంలో వచ్చిన ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులో ఉండటంతో టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ వీకెండ్ ట్రై చేయొచ్చు.
OTT: JioHotstar
భాష: మలయాళం + తెలుగు డబ్
స్ట్రీమింగ్: సెప్టెంబర్ 18 నుంచి
జానర్: యాక్షన్, సర్వైవల్ థ్రిల్లర్
మ్యాంగో పచ్చ (తెలుగు డబ్బింగ్ కన్నడ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబరు 14- JioHotstar
కర్మాఖ్య (తెలుగు హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబరు 19- JioHotstar
ది అవేకనింగ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ఫిల్మ్)- సెప్టెంబరు 19- JioHotstar
డోంట్ బీ షై..
సీరియస్ కంటెంట్ కాకుండా కాస్త లైట్, యూత్‌ఫుల్, రొమాంటిక్ వైబ్స్ కావాలనుకునేవారికి ‘Don’t Be Shy’ ట్రై చేయొచ్చు. ష్యామిలి ‘షై’ దాస్ అనే యువతి జీవితంలోకి అనుకోకుండా వచ్చే ప్రేమ, రిలేషన్‌షిప్ కన్ఫ్యూజన్స్, తన జీవితాన్ని తానే డిసైడ్ చేసుకునే ప్రయత్నం చుట్టూ ఈ కథ సాగుతుంది.
OTT: Amazon Prime Video
స్ట్రీమింగ్: సెప్టెంబర్ 25
జానర్: రొమాంటిక్ కామెడీ, యూత్ డ్రామా
అగాధ – ZEE5
హారర్ కంటెంట్‌ను ఇష్టపడే వారికి ఈ వారం ‘అగాధ’ మంచి ఆప్షన్. ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన ఈ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ సెప్టెంబర్ 25 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. నిషేధిత అటవీ ప్రాంతంలోని ఓ మిస్టీరియస్ గుహ.. అక్కడికి వెళ్లిన తర్వాత వరుసగా జరిగే అనూహ్య ఘటనలు.. కుటుంబాన్ని వెంటాడుతున్న ఓ చీకటి శక్తి.. ఇవన్నీ కలిపి కథను హారర్ జోన్‌లోకి తీసుకెళ్తాయి. మహాదేవి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ‘షికావా’ అనే నిషేధిత గుహలోకి వెళ్లిన తర్వాత అసలు కథ మొదలవుతుంది.
OTT: ZEE5
స్ట్రీమింగ్: సెప్టెంబర్ 25
జానర్: హారర్, సూపర్‌నేచురల్ థ్రిల్లర్
దర్శకుడు: ఎం.ఎస్. రాజు
హుంకార్ – ది రోర్
కోర్ట్‌రూమ్ డ్రామాలు, సోషల్ ఇష్యూస్ బేస్డ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ‘Hunkkaar – The Roar’ మరో ఆసక్తికరమైన రిలీజ్. 17 ఏళ్ల యువతి ఓ ప్రభావశీల ఆధ్యాత్మిక గురువుపై లైంగిక వేధింపుల ఆరోపణ చేయడంతో కథలో అసలు డ్రామా మొదలవుతుంది. ఆ తర్వాత ఆమె ఎదుర్కొనే ఒత్తిళ్లు, న్యాయం కోసం చేసే పోరాటం, కోర్టులో జరిగే పరిణామాలు కథకు ప్రధాన అంశాలు.
OTT: JioHotstar
స్ట్రీమింగ్: సెప్టెంబర్ 25
జానర్: కోర్ట్‌రూమ్ డ్రామా, క్రైమ్
కట్టాలన్
మలయాళం నుంచి వచ్చిన మరో యాక్షన్ క్రైమ్ డ్రామా ‘Kattalan’. క్రైమ్ నెట్‌వర్క్, స్మగ్లింగ్, పవర్ గేమ్, రివేంజ్ వంటి ఎలిమెంట్స్‌తో కథ సాగుతుంది. ఆంటోనీ వర్గీస్, సునీల్, కబీర్ దుహాన్ సింగ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా మలయాళం ప్రేక్షకులతో పాటు తెలుగు డబ్బింగ్ ఆడియన్స్‌కు కూడా అందుబాటులో ఉంది.
OTT: Amazon Prime Video
భాష: మలయాళం + తెలుగు డబ్
జానర్: యాక్షన్, క్రైమ్ డ్రామా
రైజ్ అండ్ ఫాల్ సీజన్ 2 – Prime Video / MX Player
సినిమాలు కాకుండా రియాలిటీ షోస్ ఇష్టపడేవారికి ‘Rise and Fall Season 2’ ఉంది. ఈసారి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 15 మంది కంటెస్టెంట్లు రెండు వర్గాలుగా విడిపోయి ఆడే ఈ పవర్ గేమ్‌లో స్ట్రాటజీస్, అలయన్స్‌లు, టాస్కులు, ఎలిమినేషన్స్ కీలకంగా మారనున్నాయి.
OTT: Prime Video, MX Player
స్ట్రీమింగ్: సెప్టెంబర్ 26
జానర్: రియాలిటీ, గేమ్ షో
హోస్ట్: వీరేంద్ర సెహ్వాగ్
నియలీ (తెలుగు డబ్బింగ్ క్రైమ్ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబరు 16- Prime Video
సుల్తానా (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మ్యూజికల్ డ్రామా ఫిల్మ్)- సెప్టెంబరు 17- Prime Video
రామ్ అండ్ లీలా (తెలుగు డబ్బింగ్ తమిళ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ సినిమా)- సెప్టెంబరు 18- Prime Video
