అడ్వాన్స్ బుకింగ్స్లో జవాన్ జోరు.. రికార్డ్స్ అన్నీ బ్రేక్!

అడ్వాన్స్ బుకింగ్స్లో జవాన్ జోరు.. రికార్డ్స్ అన్నీ బ్రేక్!

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shahrukh khan) హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ జవాన్(Jawan). తమిళ దర్శకుడు అట్లీ కుమార్(Atlee kumar) తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. పఠాన్(Pataan) మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.వేయి కోట్లు కొల్లగొట్టిన షారుఖ్ నుండి వస్తున్న సినిమా కావడంతో.. జవాన్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా చూసేందుకు ఆడియన్స్ ఎగబడుతున్నారు. ఈ క్రమంలోనే అడ్వాన్స్ బుకింగ్ లో ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరబాద్, కోల్‌కతా, చెన్నైల్లో వంటి ప్రధాన నగరాల్లో భారీ వసూళ్లు రాబడుతోంది జవాన్ మూవీ. ఈ జోరు చూస్తుంటే.. జవాన్ మూవీ భారత సినీ చరిత్రలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసేలానే కనిపిస్తుంది.

Also Read : అసలైన చంద్రముఖి నేనే.. అసలు కథ ఇదే.. ఆసక్తిరేపుతున్న కంగనా కామెంట్స్

పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీస్ వంటి మల్టీప్లెక్స్‌లో ఇప్పటికే రెండు లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడైపోయాయి. అందులో ఢిల్లీలో 60 వేలు, ముంబైలో 55 వేలు, బెంగుళూరులో 60 వేలు, కోలకతాలో 50 వేలు, చెన్నైలో 75 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ క్రమంలో కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే రూ.26 కోట్ల భారీ మొత్తాన్ని కలెక్ట్ చేసింది ఈ సినిమా. దీంతో బాహుబలి 2, పఠాన్, గదర్ 2 పేరిట ఉన్న  అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. కలెక్షన్స్ విషయంలో కూడా ఈ జవాన్ సినిమా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసేలానే కనిపిస్తోంది. దీంతో షారుక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. జవాన్ కూడా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేయడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.