
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్(Kangana ranaut) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ చంద్రముఖి(Chandramukhi2)– 2. 2005లో రజినీకాంత్(Rajanikanth) హీరోగా వచ్చిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది ఈ సినిమా. మొదటి పార్టీ ను డైరెక్ట్ చేసిన దర్శకుడు పీ వాసునే(P Vasu) ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. రాఘవ లారెన్స్(Raghava lawrence) హీరోగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అనౌన్స్మెంట్ తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే తాజాగా చంద్రముఖి– 2పై ఆసక్తికర కామెంట్స్ చేసింది హీరోయిన్ కంగనా.
ALSO READ : ప్రధాని మోదీ ఎస్పీజీ డైరెక్టర్ మృతి
చంద్రముఖి– 2 ప్రమోషన్స్ లో భాగంగా చైన్నెలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు మేకర్స్. ఈ సంధర్బంగా కంగనా రనౌత్ మాట్లాడుతూ.. చంద్రముఖి– 2 తమిళంలో నేను నటించిన మూడో సినిమా. ఈ సినిమా చేయడం నాకు చాలా కొత్త అనుభూతి. నేను చంద్రముఖి చూశాను. అందులో జ్యోతిక చాలా అద్భుతంగా నటించారు. చంద్రముఖి– 2 చేయడంలో ఆమె నాకు స్ఫూర్తి. అయితే ఆమెతో ఆమెంతో నన్ను పోల్చకండి. ఎందుకంటే నేను చేస్తున్న పాత్రే అసలైన చంద్రముఖి. అది చాలా ఆసక్తికరంగా డిజైన్ చేశారు దర్శకుడు.
హారర్ర్, కామెడీ ఫ్యామిలీ అంశాలలో కూడిన ఇలాంటి కలర్ ఫుల్ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది.. అంటూ చెప్పుకొచ్చాడు కంగనా. ప్రస్తుతం కంగనా చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
For My Fans…#chandramukhi2#lycaproductions pic.twitter.com/IllRkVUwqW
— Raghava Lawrence (@offl_Lawrence) August 27, 2023