నా హెల్త్ కండిషన్ మెరుగవుతోంది: అఫ్రిది

నా హెల్త్ కండిషన్ మెరుగవుతోంది: అఫ్రిది

న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీకి కరోనా సోకిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అఫ్రిది హెల్త్‌ కండిషన్‌పై అనేక రూమర్స్ వస్తున్నాయి. దీనిపై క్లారిటీ ఇస్తూ మాజీ హిట్టర్ ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ‘నా ఆరోగ్యం విషయంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఏవేవో పుకార్లు రావడం దృష్టికి వచ్చింది. మొదటి రెండ్రోజులు చాలా కఠినంగా అనిపించింది. కానీ ఆ తర్వాత రోజుల్లో నా పరిస్థితి బాగా మెరుగుపడింది. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు వ్యాధితో పోరాడనంత వరకు దాన్ని ఓడించలేరు. ఈ రోజులు నాకు చాలా కఠినంగా గడుస్తున్నాయి. ఈ 8 నుంచి 9 రోజులుగా నా పిల్లల బాగోగులు చూసుకోకపోవడం వర్రీగా ఉంది. కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నాతోపాటు ఇతరులను సేఫ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చారిటీ వర్క్ కోసం తిరుగుతున్నప్పుడు వైరస్ సోకే ప్రమాదం ఉందని నాకు తెలుసు. అదృష్టవశాత్తూ, ఇది మొదట్లో జరగలేదు. లేకపోతే ఇంతమంది ప్రజలకు సాయం చేసేవాణ్ని కాదు. వారికి నిత్యావసరాలను పంపడం కుదిరేది కాదు’ అని అఫ్రిది చెప్పాడు.