అతడు బచ్చా కాదు.. బాప్: యువ క్రికెటర్‌పై షారుఖ్ ఖాన్ ప్రశంసలు

అతడు బచ్చా కాదు.. బాప్: యువ క్రికెటర్‌పై షారుఖ్ ఖాన్ ప్రశంసలు

కేకేఆర్ యువ క్రికెటర్ రింకు సింగ్‌పై బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. ట్విట్టర్ వేదికగా #AskSRK పేరుతో ఫ్యాన్స్‌తో ముచ్చటించిన బాద్ షా.. రింకు సింగ్ గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అందరినీ ఆశ్చర్యపరిచే సమాధానమిచ్చాడు. 

'కేకేఆర్‌ కా బచ్చా రింకూ సింగ్‌ గురించి ఒక్క మాటలో చెప్పండి..' అని ఓ అభిమాని షారుఖ్‌ను ప్రశ్నించగా.. అతడు 'రింకూ సింగ్ బచ్చా కాదు.. బాప్‌' అంటూ అభిమానికి దిమ్మదిరిగే సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ ట్రెండింగ్‌లో సాగుతోంది.

KKR owner Shahrukh Khan gives a befitting reply to a twitter user.#ShahrukhKhan #RinkuSingh pic.twitter.com/ulu35XbfVd

— CricTracker (@Cricketracker) June 25, 2023

ఓ అనామక ప్లేయర్‌గా ఐపీఎల్‌‌లోకి ఎంట్రీ ఇచ్చిన రింకు సింగ్.. ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో తన పేరును ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో చివరి ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాధి కేకేఆర్ జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు. అదొక్కటే కాదు.. ప్రతి మ్యాచులోనూ నిలకడగా రాణిస్తూ జట్టులో ఆటగాడిగా మారిపోయాడు.

ఐపీఎల్‌ 2023 సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన రింకు సింగ్ 59.25 సగటుతో 474 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. త్వరలో వెస్టిండీస్‌తో జరగబోయే టీ20 సిరీస్‌‌కు రింకు సింగ్‌ను ఎంపిక చేసే అవకాశముంది.