BCCI జోక్యంతో షమీకి వీసా మంజూరు చేసిన అమెరికా

BCCI జోక్యంతో షమీకి వీసా మంజూరు చేసిన అమెరికా

భారత జట్టు పేస్ బౌలర్ మహమ్మద్ షమీకి అమెరికా వీసా నిరాకరించింది. అయితే BCCI జోక్యంతో వీసా మంజూరైంది. షమీపై పోలీసు కేసులు ఉండడమే అమెరికా వీసా నిరాకరణకు కారణంగా తెలుస్తోంది. షమీపై గతేడాది భార్య హసీన్ జహాన్ కోల్ కతా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో షమీపై గృహహింస కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ వ్యవహారం విచారణలో ఉండడంతో తాము షమీకి వీసా మంజూరు చేయలేమంటూ అమెరికా రాయబార కార్యాలయ వర్గాలు  తెలిపాయి. అయితే, షమీ ఇంటర్నేషనల్ ప్లేయర్ అని… అతనికి P1 కేటగిరీలో వీసా మంజూరు చేయాల్సిందిగా BCCI సీఈఓ రాహుల్ జోహ్రీ అమెరికన్ ఎంబసీకి లేఖ రాశారు. దాంతో షమీకి వీసా మంజూరైంది. వచ్చే నెలలో ప్రారంభమయ్యే వెస్టిండీస్ టెస్టు సిరీస్‌కు షమీ ఎంపికయ్యాడు. త్వరలోనే వెస్టిండీస్ పర్యటనకు వెళుతున్న టీమిండియా మొదట అమెరికాలో విండీస్ జట్టుతో రెండు T 20 మ్యాచ్ లు ఆడనుంది.