జులై నెల.. శని త్రయోదశితో ప్రారంభం.. ఈ రాశుల వాళ్లు తైలాభిషేకం చేస్తే మంచిది

జులై నెల.. శని త్రయోదశితో ప్రారంభం.. ఈ రాశుల వాళ్లు తైలాభిషేకం చేస్తే మంచిది

త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. శనివారం శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు.ఈ రోజు శని దేవుడికి చెందినది. శని గ్రహం యొక్క దుష్ప్రభావంతో బాధపడుతున్న వ్యక్తులకు ఆయనను ప్రార్థించడం ఓదార్పునిస్తుంది.

2023 జులై 1న   శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. శనివారం శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు.ఈ రోజు శని దేవుడికి చెందినది. శని గ్రహం యొక్క దుష్ప్రభావంతో బాధపడుతున్న వ్యక్తులకు ఆయనను ప్రార్థించడం ఓదార్పునిస్తుంది. ఇది చాలా పవిత్రమైన రోజు. ఈ పవిత్రమైన రోజున శని స్వామిని ప్రార్థించడం వలన  చాలా ప్రయోజనాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. శనివారం శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు. అలాగే త్రయోదశి శనివారం (జులై 1)నాడు వస్తే శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పెద్దలు పేర్కొంటారు.

శని త్రయోదశి రోజు (జులై 1)ప్రతి ఒక్కరూ శనికి తైలాభిషేకం, నవగ్రహ ఆలయ దర్శనము, శివాలయ దర్శనము చేసుకోవడం మంచిది. ముఖ్యంగా అష్టమ శని ప్రభావం ఉన్న కర్కాటక రాశి జాతకులు, అర్ధాష్టమ శని ప్రభావం ఉన్న వృశ్చిక రాశి జాతకులు, ఏలినాటి శని ప్రభావం ఉన్న మకర, కుంభ, మీన రాశుల జాతకులు శనికి తైలాభిషేకం చేయించుకొని దశరథ ప్రోక్త శని స్తోత్రములను పఠించినట్లయితే వారికి ఏలినాటి శని, అర్జాష్టమ శని, అష్టమ శని వంటి దోషాలు తగ్గుతాయి.

శని త్రయోదశి  శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు. అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన దినం. అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పెద్దలు చెబుతుంటారు. శని జన్మించిన తిథి కూడా త్రయోదశి అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. 

శ్రీమహాలక్ష్మి, నారాయణుడు అశ్వత్థ (రావి) వృక్షంపై ఉంటారాని పురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఆ రోజు (జులై 1)  రావి వృక్ష సందర్శన, ప్రదక్షిణ చేయాలి. శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి. కాకికి నైవేద్యం పెట్టాలి. నల్లనువ్వులు, నువ్వుల నూనె, నల్లని వస్త్రంలో ఉంచి దానం చేయాలి. శని బాధలు తీరేందుకు ఇలా స్తోత్రం చేయాలి.

“నీలాంజన సమాభాసం... రవిపుత్రం యమాగ్రజమ్‌...
ఛాయా మార్తాండ సంభూతం... తం నమామి శనైశ్చరమ్‌”

అనే శ్లోకాన్ని పఠిస్తే మంచిది.

శనిత్రయోదశి రోజు పాటించవలసిన ముఖ్య నియములు ఏమిటంటే... ఈ రోజున (జులై 1)  ఉపవాసం ఉండటం మంచిది. శని శాంతి పూజలు ఈ శని త్రయోదశి నాడు చేయించడం వలన అర్జాష్టమ శని, ఏలినాటి శని వలన వచ్చే కష్టాలు తొలగుతాయి. 

* శనివారం ( జులై 1)తెల్లవారుజామున 6.30 నుండి 7.30 మధ్య ఉంటుంది (శని హోర అని కూడా పిలుస్తారు) ఈ సమయంలో రుద్రాభిషేకం చేయడం వల్ల మంచి       ఫలితాలు వస్తాయి.
*  శనివారం (జులై1) సాయంత్రం, "ప్రదోష సమయం" అంటే 5:30 నుండి 6:30 మధ్య సమయం, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వలన విశేషమైన ప్రయోజనాలను పొందుతారు
* సూర్యోదయానికి ముందే తలస్నానం చేయాలి
* శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు ఉపవాసం పాటించాలి.
* శని త్రయోదశి పూజలో భాగంగా ప్రజలు తైలాభిషేకం చేయాలి.
* శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని నల్ల గ్రాములు, 100 గ్రాముల అల్లం నూనె ప్యాకెట్, 1 కిలోల బొగ్గు, ఒక చిన్న నల్ల రిబ్బన్, 8 ఇనుప మేకులు, కొన్ని     నవధాన్యాలు కట్టి, ఆలయ పూజారికి దానం చేయండి లేదా ప్రవహించే నీటి వనరులో వేయండి.
* కాకికి ఆహార పదార్థాలను అందించి, అవసరమైన వ్యక్తికి ఆహారం ఇవ్వండి.