వరల్డ్ కప్ నుంచి షాన్‌ మార్ష్‌ ఔట్

వరల్డ్ కప్ నుంచి షాన్‌ మార్ష్‌ ఔట్

మాంచెస్టర్‌: ఆస్ట్రేలియా టీమ్ కు ఎదురుదెబ్బ తగిలింది. బ్యాట్స్‌ మన్‌ షాన్‌ మార్ష్‌ గాయం కారణంగా వరల్డ్ కప్ నుంచి దూరమయ్యాడు. ఈ విషయాన్ని శుక్రవారం ఐసీసీ ప్రకటించింది. నెట్స్‌ లో ప్రాక్టీస్ చేస్తుండగా మార్ష్‌ మణికట్టు విరిగిందని తెలిపింది. అతని ప్లేస్ లో వికెట్‌ కీపర్‌ పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌ రానున్నాడని ఆస్ట్రేలియా కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ తెలిపాడు.

‘నెట్స్‌ లో ప్రాక్టీస్ చేస్తున్న మాక్స్‌ వెల్‌ కు కూడా గాయమయ్యింది. అతని గాయం తీవ్రత అంతగా లేదు. స్టార్క్‌, కమిన్స్ బౌలింగ్‌ ఎదుర్కొంటూ మార్ష్, మాక్స్‌వెల్‌ గాయపడ్డారు’ అని అన్నాడు. ప్రస్తుత వరల్డ్ కప్ లో మార్ష్‌ రెండు మ్యాచ్‌ లు మాత్రమే ఆడాడు. శ్రీలంకపై 3, పాకిస్థాన్‌ పై 23 రన్స్ చేశాడు. ఆసీస్‌ ఎనిమిది మ్యాచ్‌ ల్లో ఏడు విక్టరీలు సాధించి పాయింట్స్ టేబుల్ లో టాప్ లో కొనసాగుతోంది. శనివారం మాంచెస్టర్‌ లో సౌతాఫ్రికాతో ఆసీస్‌ తలపడనుంది.