గొర్రెల పెంపకందార్ల సమస్యలు పరిష్కరిస్తా : షీప్ ఫెడరేషన్ చైర్పర్సన్ సరిత

గొర్రెల పెంపకందార్ల సమస్యలు పరిష్కరిస్తా : షీప్ ఫెడరేషన్ చైర్పర్సన్ సరిత

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలోని గొర్రెలు, మేకల పెంపకందార్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని షీప్​ఫెడరేషన్ చైర్​పర్సన్​సరిత హామీ ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని జీఎంపీఎస్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.  ప్రభుత్వాలు కొన్ని సమస్యలు పరిష్కరించినప్పటికీ ఇంకా పలు సమస్యలు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయన్నారు.

ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల వల్ల జీవాలు మృతి చెందినా నష్టపరిహారం అందడం లేదని, గొర్రెల కాపరులు మృతి చెందినా రూ.1 లక్ష ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేషియో మాత్రమే లభిస్తోందని, ఇతర వృత్తిదారులతో పోలిస్తే ఇది తక్కువని పేర్కొన్నారు. ఇటీవల కుక్కల దాడుల్లో అనేక ప్రాంతాల్లో గొర్రెపిల్లలు మృతి చెందిన ఘటనలు తన దృష్టికి వచ్చాయని చెప్పారు. అన్ని సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ మాట్లాడుతూ.. సంఘం స్థాపించి 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆగస్టు 22, 23, 24 తేదీల్లో చెంగిచెర్లలో రాష్ట్ర మహాసభలను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్లు రవీందర్ పేర్కొన్నారు.