ఇండియన్ ఐతే ద్వేషించాలా? కోహ్లీని ఎందుకు పొగడొద్దు.?

ఇండియన్ ఐతే ద్వేషించాలా? కోహ్లీని ఎందుకు పొగడొద్దు.?

ప్రస్తుత క్రికెటర్ల ఆటతీరుపై ఎప్పటికపుడు తన యూట్యూబ్ ఛానల్ లో అభిప్రాయం చెబుతుంటాడు పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ల అక్తర్. అయితే ఇటీవల ఇండియన్ కెప్టెన్ వీరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆట తీరున ప్రశంసించారు. అయితే ఈ విషయంపై పాక్ లో కొందరు అభిమానులు అక్తర్ ను విమర్శిస్తున్నారు.  లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో  తనను విమర్శించే అభిమానులకు ధీటైన సమాధానమిచ్చాడు.

విరాట్ కోహ్లీని, రోహిత్ లను ఎందుకు పొగడకూడదో చెప్పాలని ప్రశ్నించాడు అక్తర్. అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీ సాధించిన రికార్డులను చూస్తే ఎవరైనా ప్రశంసిస్తారన్నాడు. కోహ్లీ ప్రపంచలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడని  అన్నాడు. తక్కువ టైంలోనే 70 సెంచరీలు సాధించడని.. ఎవరు కూడా అతడి దరిదాపుల్లో లేరన్నాడు. కోహ్లీ ఇండియన్ కాబట్టి ద్వేషించాలా? పొగడకూడదా? అని తిరిగి ప్రశ్నించాడు. అసలు పాక్ అభిమానులు తనను ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదన్నాడు. తనను విమర్శించే ముందు ఒక్కసారి కోహ్లీ రికార్డులు చూడాలన్నాడు. కోహ్లీ, రోహిత్ శర్మలు అద్భతంగా రాణిస్తున్నారన్నాడు అక్తర్.

కేసీఆర్ అవినీతిని ఆధారాలతో సహా బయటపెడ్తం

భద్రాద్రి కొత్తగూడెంలో ఎదురు కాల్పులు..మావోయిస్టు మృతి

ఆదిపురుష్ లో ప్రభాస్ కు విలన్ గా సైఫ్ అలీ ఖాన్

హయ్యెస్ట్..భారత్ లో ఒక్కరోజే 83,883 కేసులు