IND vs ENG 2nd Test: పగ తీర్చుకున్న అయ్యర్.. స్టోక్స్‌కు దిమ్మ తిరిగే కౌంటర్

IND vs ENG 2nd Test: పగ తీర్చుకున్న అయ్యర్.. స్టోక్స్‌కు దిమ్మ తిరిగే కౌంటర్

వైజాగ్ టెస్టులో టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. హైదరాబాద్ టెస్టు ఓటమికి తాజాగా వైజాగ్ టెస్టును గెలిచి సిరీస్ ను 1-1 తో సమం చేసింది. ఓ వైపు టీమిండియా పగ తీర్చుకుంటే.. మరోవైపు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కు శ్రేయాస్ అయ్యర్ తన రివెంజ్ తీర్చుకున్నాడు. స్టోక్స్ ను రనౌట్ చేసిన అయ్యర్..'ఫింగర్ సెలబ్రేషన్'తో అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. అశ్విన్ వేసిన ఓవర్లో ఫోక్స్ మిడ్ వికెట్ మీదుగా బంతిని ఆడాడు. ఈ స్థానంలో ఫీల్డింగ్ చేస్తున్న అయ్యర్..మెరుపు త్రో తో బాల్ విసిరాడు.
 
బంతి డైరెక్ట్ గా వికెట్లను గిరాటేయడంతో రెప్పపాటులో ఇంగ్లాండ్ స్టోక్స్ వికెట్ ను కోల్పోయింది. ఈ వికెట్ సెలెబ్రేషన్ ను అయ్యర్ స్పెషల్ గా జరుపుకున్నాడు. అంతక ముందు అయ్యర్ సెకండ్ ఇన్నింగ్స్ లో మిడాఫ్ మీదుగా ఆడిన బంతిని స్టోక్స్ పరిగెడుతూ డైవ్ చేసి అందుకున్నాడు. క్యాచ్ పట్టిన అనంతరం స్టోక్స్ ఫింగర్ సెలెబ్రేషన్ చేసుకున్నాడు. తాజాగా స్టోక్స్ ను అయ్యర్ రనౌట్ చేసి ఇదే తరహా సెలెబ్రేషన్ చేసుకోవడం విశేషం. అంతకముందు ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలి క్యాచ్ ను అయ్యర్ అద్భుతంగా ఆదుకున్నాడు. 

వైజాగ్ టెస్ట్ విషయానికి వస్తే టీమిండియా 106 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 292 పరుగులకు ఆలౌటైంది. క్రాలి 73 పరుగులు చేసి పోరాడినా మిగిలిన వారందరూ విఫలమయ్యారు.   అశ్విన్, బుమ్రా చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లను తలో వికెట్ లభించింది.