సైమా అవార్డ్స్ నామినేషన్ ప్రకటన.. చిత్రాలివే

సైమా అవార్డ్స్ నామినేషన్ ప్రకటన.. చిత్రాలివే

సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ (SIMHA) అవార్డ్స్ పండుగ త్వరలోనే జరుగనుంది. ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దక్షిణాదికి చెందిన నాలుగు భాషలకు (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ) చెందిన నటీ నటులు తళుక్కుమని మెరవనున్నారు. సినీ రంగంతో పాటు 24 క్రాఫ్ట్ లోని టాలెంట్ కనబరిచిన నటులు, టెక్నీషియన్స్ కు అవార్డ్స్ బహుకరిస్తారు. 2021 సంవత్సరంలో విడుదలైన నాలుగు భాషలకు సంబంధించి నామినేషన్స్ ప్రకటించారు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప’తో పాటు.. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ’ మూవీలు ఎక్కువగా నామినేషన్స్ దక్కించుకున్నాయి. పుష్ప దాదాపు 12, అఖండ 10 విభాగాల్లో నామినేషన్స్ సంపాదించినట్లు సమాచారం. 

‘పుష్ప’లో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత విభాగాలున్నట్లు తెలుస్తోంది. అఖండలో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీతం, ఫైట్స్, ఫొటోగ్రఫీ విభాగాలున్నట్లు సమాచారం. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ‘జాతి రత్నాలు’ కూడా నామినేషన్ లో ఉన్నట్లు, ఉత్తమ కమెడియన్ తో పాటు పలు విభాగాల్లో 8 నామినేషన్స్ దక్కించుకుందని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా వచ్చిన ‘ఉప్పెన’ సినిమాకు సంబంధించి ఉత్తమ నూతన నటీనటులుగా, ప్రతి నాయకుడిగా.. మొత్తం 8 నామినేషన్లు సాధించిందని టాక్. మరి ఏ చిత్రం ఏ విభాగంలో ఎన్ని అవార్డ్స్ సాధిస్తుందో చూడాలి.

మలయాళం
మిన్నల్ మురళీ (టోవినో థామస్) 10
మాలిక్ (ఫహద్ ఫాజిల్) 06
కురుప్ (దుల్కర్ సల్మాన్) 08
జోజీ (ఫహద్ ఫాజిల్) 06

తెలుగు 
పుప్ష ది రైజ్ (అల్లు అర్జున్) 12
అఖండ (బాలకృష్ణ) 10
జాతిరత్నాలు (నవీన్ పొలిశెట్టి) 08
ఉప్పెన (వైష్ణవ్ తేజ్) 8

కన్నడ
రాబర్ట్ (దర్శన్) 10
గరుడ గమన వృషభ వాహన (రాజ్ బి శెట్టి) 08
యువరత్న (పునీత్ రాజ్ కుమార్) 07

తమిళం 
కర్ణన్ (ధనుష్) 10
డాక్టర్ (శివ కార్తికేయన్) 09
మాస్టర్ (విజయ్) 07
తలైవి (కంగనా రనౌత్) 07