ఇటాలియన్ ఓపెన్‌ టైటిల్‌ కైవసం చేసుకున్న హలెప్

ఇటాలియన్ ఓపెన్‌ టైటిల్‌ కైవసం చేసుకున్న హలెప్

రోమ్‌: టాప్‌ సీడ్‌, వరల్డ్‌ రెండో ర్యాంకర్‌ సిమోనా హలెప్​.. ఫస్ట్‌ టైమ్‌ ఇటాలియన్‌ ఓపెన్‌ టైటిల్‌‌‌‌ను సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన వుమెన్స్‌ ఫైనల్లో స్కోరు 6–0, 2-1 ఉన్న దశలో డిఫెండింగ్‌ చాంపియన్‌ కరోలినా ప్లిస్ కోవా (చెక్‌ ) మ్యాచ్‌ నుంచి వైదొలిగింది. దీంతో హలెప్​కు వాకోవర్‌ విజయం లభించింది. మూడోసారి ఈ టోర్నీలో బరిలోకి దిగిన హలెప్​.. 2017, 18లో రన్నరప్‌ తో సరిపెట్టుకుంది. ఎడమ తొడకు బ్యాండేజ్‌ కట్టుకుని బరిలోకి దిగిన ప్లిస్ కోవా మ్యాచ్‌ మధ్యలో లోయర్‌ బ్యాక్‌, అప్పర్‌ లెగ్‌ కు ట్రీట్‌ మెంట్‌ తీసుకుని మ్యాచ్‌ ను కొనసాగించింది. అయితే సర్వీస్‌‌‌‌ల్లో ఇబ్బందులుపడటంతో.. హలెప్​ 20 నిమిషాల్లోనే సెట్‌ ను సొంతం చేసుకుంది.

రెండోసెట్‌ ఫస్ట్‌ గేమ్‌ లోనూ ప్లిస్ కోవా సర్వీస్‌‌‌‌ను కోల్పోయింది. కానీ వెంటనే పుంజుకుని రెండో గేమ్‌ లో హలెప్​ సర్వ్‌‌‌‌ను బ్రేక్‌ చేసి స్కోరును 1–1తో సమం చేసింది. కానీ మూడో గేమ్‌ లో గాయం తీవ్రత పెరగడంతో మ్యాచ్‌ నుంచి తప్పుకుంది. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా ఈ సీజన్‌ లో హలెప్​కు ఇది వరుసగా 14వ విజయం.

మెన్స్‌ సింగిల్స్‌ టైటిల్‌‌‌‌ను టాప్‌ సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో జొకోవిచ్‌ 7–5, 6–3తో ష్వార్జ్‌ మెన్‌ (అర్జెంటీనా)పై గెలిచాడు. మ్యాచ్‌ మొత్తంలో జొకో 3 ఏస్‌‌‌‌లు కొడితే, ష్వార్జ్‌ మెన్‌ ఒక ఏస్‌‌‌‌తో సరిపెట్టుకున్నాడు. తొమ్మిది బ్రేక్‌ పాయింట్‌ అవకాశాల్లో జొకో ఐదింటిని సద్వినియోగం చేసుకున్నాడు.