పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ గెలుపు ఖాయం : ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్

పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ గెలుపు ఖాయం : ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్

పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ గెలుపు ఖాయమన్నారు ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్.ధర్మపురి పట్టణంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అరు గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే నాలుగు హామలు అవుతున్నాయని..మరో రెండు త్వరలో అమలు చేస్తామని  తెలిపారు. ఆగష్టు 15 లోపు రైతుల రుణమాఫీ చేస్తామని ఇప్పటికే సిఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని అన్నారు. గత ప్రభుత్వం చేసిన పొరపాట్ల వల్ల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని విమర్శించారు. 

పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటుతో పాటు, రోళ్ళవాగు ప్రాజెక్ట్ పనులపై ఇప్పటికే  సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ ఓటమి కోసం బీఆర్ఎస్ నాయకులు,బీజేపీకి ఓటు వేయాలని ఓటర్లను కోరడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. గత ప్రభుత్వంలో రైస్ మిల్లర్లతో కుమ్మక్కై,మంత్రి కొప్పుల రైతులను దోచుకున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.