జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల అంశంపై శాసనమండలిలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. బుధవారం ( మార్చి 18 ) సభలో మాట్లాడుతూ.. అక్రిడేషన్ కార్డులు కేవలం గుర్తింపు కోసమేనని.. జర్నలిస్టులకు కావాల్సింది హెల్త్ కార్డులని అన్నారు మల్లన్న. ప్రింట్ పేపర్ చదివేవాళ్ళు,ఎలక్ట్రానిక్ మీడియా చూసేవాళ్ళు తగ్గిపోయారని అన్నారు. ప్రజలు డిజిటల్ మీడియా వైపు చూస్తున్నారని..ప్రభుత్వం డిజిటల్ మీడియా పాలసీ తీసుకురావాలని అన్నారు మల్లన్న.
ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ డెస్క్, రిపోర్టర్లు అని వేరు చేసే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని..అక్రిడేషన్ కార్డులు నిజమైన జర్నలిస్టులకు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
గతంలో జర్నలిస్టులకు హౌసింగ్ సైట్స్ ఇవ్వాలనుకున్నామని... ఇచ్చే లోపే ఆటంకాలు వచ్చాయని అన్నారు పొంగులేటి.అర్హులైన జర్నలిస్టులకు న్యాయస్థానంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి.
