హ్యాట్సాఫ్ ఇండియా : ఇరాన్ దేశానికి మందులు పంపించిన భారత్

హ్యాట్సాఫ్ ఇండియా : ఇరాన్ దేశానికి మందులు పంపించిన భారత్

మానవత్వంలో ఇండియాకు సాటిలేదు.. ఇండియాకు ఉన్న మానవత్వం ఏంటో ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు. 17 రోజులుగా ఇరాన్ దేశంలో జరుగుతున్న యుద్ధంతో.. వేల మంది చనిపోయారు.. వేుల మంది గాయపడ్డారు.. లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. ఈ క్రమంలోనే మానవత్వంతో స్పందించింది ఇండియా. మన దేశం నుంచి ఇరాన్ జనానికి అవసరం అయిన మందులను పంపించింది ఇండియా. 

ఇరాన్ దేశంలో జరుగుతున్న యుద్ధం.. అదే సమయంలో ఇరాన్ దేశంపై ఉన్న ఆంక్షల క్రమంలో.. ఇరాన్ దేశంలో మందుల కొరత ఏర్పడింది. ప్రజలకు అత్యవసరం అయిన మందులకు ఇబ్బందులు వచ్చాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఇండియా.. 2026, మార్చి 18వ తేదీన ఇండియా నుంచి ఓ నౌక ద్వారా.. అత్యవసరం మందులను ఇరాన్ దేశానికి పంపించింది ఇండియా. 

మనకు రెడ్ క్రాస్ సంస్థ ఉన్నట్లే.. ఇరాన్ దేశంలో రెడ్ క్రెసెంట్ అనే సంస్థ ఉంది. ఇరాన్ దేశంలో స్వచ్ఛంధంగా పని చేస్తుంది ఈ రెడ్ క్రెసెంట్ సంస్థ. వైద్య సాయం అందిస్తుంది. ఇరాన్ ప్రభుత్వం యుద్ధంతో బిజీగా ఉండటంతో.. ఆ దేశంలో స్వచ్ఛంధ సంస్థ నడుస్తున్న రెడ్ క్రెసెంట్ సంస్థకు ఈ మందులను పంపించింది ఇండియా.

అత్యవసర సమయంలో.. అత్యవసరం అయిన మందులను పంపించిన ఇండియాకు ధన్యవాదాలు తెలిపింది ఇరాన్ దేశం. మానవత్వంతో ఆదుకున్నందుకు హ్యాట్సాఫ్ ఇండియా అంటోంది ఇరాన్ దేశం. ఇప్పటికే ఇండియా నుంచి బయలుదేరిన ఈ మందుల నౌక.. మూడు రోజుల్లో ఇరాన్ దేశం చేరనున్నట్లు చెబుతున్నారు అధికారులు.