Sanju Samson: డీఎస్పీగా సంజు శాంసన్.. కేరళ సర్కార్ క్లారిటీ!

Sanju Samson: డీఎస్పీగా సంజు శాంసన్.. కేరళ సర్కార్ క్లారిటీ!

Sanju Samson: టీ20 ప్రపంచ కప్-2026ను గెలిచి భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. మూడవ సారి పొట్టి ప్రపంచకప్ టైటిల్స్ గెలుచుకున్న ఏకైక జట్టుగా టీమిండియా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ విజయంలో వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్ కీలక పాత్ర పోషించాడు. కీలకమైన సూపర్–-8 మ్యాచ్ లో పాటు సెమీస్, ఫైనల్లోనూ సంజూ అద్భుతంగా ఇన్నింగ్స్ ఆడాడు. అతడు కేవలం ఐదు మ్యాచ్లలోనే 80.25 సగటు 321 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ టోర్నీ అవార్డుని కైవసం చేసుకున్నాడు. 

ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం సంజు శాంసని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉద్యోగంతో సత్కరించినట్లు సోషల్ మీడియాలో కొంత మంది పోస్టులు పెట్టారు. అయితే ఈ విషయంపై కేరళ ఫ్యాక్ట్ చెక్ విభాగం రియాక్ట్ అయింది. ఇవన్ని  నెట్టింట అసత్య ప్రచారాలని, కేరళ సర్కార్ డిస్పీ పోస్టుపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. కాగా వైరల్ అవుతున్న ఫోటోలు కేవలం ఏఐ ద్వారా మాత్రమే సృష్టించినవి తేల్చింది. 

కాగా టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత తిరువనంతపురంలో సంజు శాంసన్ ని కేరళ ప్రభుత్వం ఘనంగా సన్మానం చేసింది. ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ రాజేంద్ర అరేకర్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాల్గొన్నారు. అంతేగానీ అతడికి నగదు బహుమతి కానీ, ఉద్యోగం లాంటివి ఏవీ ప్రకటించలేదని వెల్లడించింది. కాగా కేరళ సీఎం విజయన్ నేరుగా సంజు ఇంటికి వెళ్లి మరీ అతడికి స్వాగతం పలికిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.