సింగీతం గారి కథలు ఏజ్‌ ‌లెస్: ‌‌‌‌కమల్ హాసన్

సింగీతం గారి కథలు ఏజ్‌ ‌లెస్: ‌‌‌‌కమల్ హాసన్

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో  వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మించిన చిత్రం ‘సింగ్ గీతం’.  ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి లీడ్ రోల్స్‌‌లో నటించిన ఈ చిత్రానికి  దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. జూన్ 11న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం (జూన్ 07)  చెన్నైలో  ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. 

అతిథిగా హాజరైన కమల్ హాసన్ మాట్లాడుతూ ‘‘మాయాబజార్’ నుంచి ఇప్పటి  ‘సింగ్ గీతం’  వరకు సింగీతం శ్రీనివాసరావు గారిలో ఎలాంటి మార్పు లేదు. సినిమా ఆయనతో పాటే ఉంది. ఇది చాలా అరుదుగా జరిగే విషయం. నాకు 20 ఏళ్లు ఉన్నప్పుడు ఆయనతో కలిసి పనిచేయడం మొదలుపెట్టాను. ఆయన సినిమాకి నిర్మాతగా, సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాను.  అప్పుడే నాకు ఆయన ఈ కథ గురించి చెప్పారు. ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు. ఇప్పుడు ఆ సినిమాను చూడబోతున్నాను. కొన్ని ఆలోచనలు, కొన్ని కథలు టైమ్‌‌లెస్‌‌గా ఉంటాయి. సింగీతం గారి కథలు కూడా అలాంటివే. అవి ఏజ్‌‌లెస్‌‌గా ఉంటాయి.  ఆయన ఇప్పటికి  జెన్జీ కంటే ముందుంటారు. ఆయనను ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.  ఈ సినిమా నేనే నిర్మించిన భావన కలుగుతోంది.   సింగీతం గారి పట్ల నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది’ అని అన్నారు. 

 దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘ఈ చిత్రం 40 సంవత్సరాల కల.  మాటలే పాటలైతే అనే ఆలోచనతో ఈ కథ పుట్టింది. ఈ కథను ఎంతోమందికి వినిపించాను. కానీ దైవ నిర్ణయం వల్ల చివరకు వైజయంతి మూవీస్ బ్యానర్‌‌పై నాగ్ అశ్విన్ నిర్మించారు. ఈ సినిమాను ఆయనే ప్రేమతో  భుజాన  వేసుకున్నారు’ అని చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగమవడం ఆనందంగా ఉందని అశ్వినీదత్ అన్నారు. సింగీతం గారి లాంటి లెజెండరీ డైరెక్టర్‌‌‌‌తో వర్క్ చేయడం లైఫ్ టైమ్ అచీవ్‌‌మెంట్ అని  దేవిశ్రీ ప్రసాద్ చెప్పాడు. నటీనటులు సహా టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.