డివిలియర్స్ కంబ్యాక్ పై సౌతాఫ్రికా బోర్డు క్లారిటీ

డివిలియర్స్ కంబ్యాక్ పై సౌతాఫ్రికా బోర్డు క్లారిటీ

జోహనెస్ బర్గ్: క్రికెట్ లో ఎంత మంది గొప్ప ఆటగాళ్లు ఉన్నా తమ ఆటతో ఎప్పుడూ ఎంటర్ టైన్ చేసే ప్లేయర్లు కొందరే ఉంటారు. అలాంటి ఆటగాళ్లలో సౌతాఫ్రికా బ్యాట్స్ మన్ ఏబీ డివిలియర్స్ ఒకడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే తన వరల్డ్ క్లాస్ హిట్టింగ్ తో అభిమానులను అలరించిన ఏబీ మూడేళ్ల కింద అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ లాంటి లీగుల్లో ఆడుతున్న ఏబీ.. మళ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడతాడు అని ఊహాగానాలు వచ్చాయి. వీటిపై క్రికెట్ సౌతాఫ్రికా స్పందించింది. డివిలియర్స్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది. అతడు తీసుకున్న నిర్ణయం ఫైనల్ అని పేర్కొంది. దీంతో అభిమానుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.