వైరల్ వీడియో: సోనూ సినిమా షూటింగ్‌‌కు భారీగా అభిమానులు

వైరల్ వీడియో: సోనూ సినిమా షూటింగ్‌‌కు భారీగా అభిమానులు

హైదరాబాద్: లాక్‌డౌన్‌‌లో వందలాది మంది వలస కూలీలను ఇళ్లకు చేర్చుకోవడంలో ప్రముఖ నటుడు సోనూ సూద్ విశేష కృషి చేశాడు. మైగ్రంట్ వర్కర్స్‌‌ను హెల్ప్ చేయడంతోపాటు ఉపాధి కోల్పోయి సమస్యలు ఎదుర్కొంటున్న చాలా మందికి సాయం చేసి తన పెద్ద మనసును చాటుకున్నాడు. దీన్ని పక్కనబెడితే.. తమకు సాయం చేసిన సోనూ సూద్‌‌ను కలవడానికి కొందరు వందలాది కిలో మీటర్లు నడుచుకుంటూ హైదరాబాద్ చేరుకోవడం విశేషం.

హైదరాబాద్‌‌లో అల్లుడు అదుర్స్ సినిమా షూటింగ్‌‌లో పాల్గొన్న సోనూ సూద్‌‌ను కలవడానికి చాలా మంది ప్రజలు మూవీ సెట్స్‌‌కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో కొందరు ప్రజలు సోనూ సూద్‌‌ను కలసి తమ బాధలు చెబుతున్నారు. వారి సమస్యలను పరిష్కరించిన సోనూకు ధన్యవాదాలు చెప్పడాన్ని చూడొచ్చు. ‘ప్రజలను చేరుకోవడానికి కొన్నిసార్లు దేవుడు మనల్ని ఉత్ప్రేరకంగా ఎంచుకుంటాడు’ అంటూ సోనూ సూద్ ఈ ట్వీట్‌‌కు రిప్లయి ఇచ్చాడు.