కోల్‌కతా: బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ బుధవారం హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాడు. గంగూలీ సోదరుడు, క్రికెట్ ఆసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) జాయింట్ సెక్రటరీ స్నేహసిష్కు కరోనా పాజిటివ్‌గా తేలింది. మాజీ ఫస్ట్ క్లాస్ ప్లేయర్ అయిన స్నేహసిష్‌ను పాజిటివ్‌గా వచ్చిన వెంటనే కోల్‌కతాలోని బెల్లే వ్యూ ఆస్పత్రిలో చేర్చారు. కొద్ది రోజులుగా స్నేహసిష్ జ్వరంతో బాధపడుతున్నాడని ఓ క్యాబ్ అధికారి తెలిపారు. హెల్త్ ప్రోటోకాల్ ప్రకారం సౌరవ్ గంగూలీ నిర్థీత పీరియడ్ వరకు హోం క్వారంటైన్‌లో ఉండనున్నట్లు తెలిసింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ.. తమ ఫ్యాక్టరీలను సోదరుడు స్నేహసిష్ తరచూ విజిట్ చేస్తుంటాడని, చాలా రిస్క్ మధ్య అతడు పని చేస్తున్నట్లు పేర్కొన్నాడు.

