న్యూఢిల్లీ, వెలుగు: ‘ఓటుకు నోటు’ కేసు బుధవారం మరోసారి సుప్రీంకోర్టు ముందుకు రానుంది. ఈ కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా, కేవలం ఎన్నికల చట్టాల నియమావళి కింద మాత్రమే విచారించాలని కోరుతూ జులై 22, 2021న రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు నుంచి తన పేరును పూర్తిగా తొలగించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏప్రిల్ 13, 2021న సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లను కలిపి జస్టిస్ జేకే. మహేశ్వరి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరుపనుంది.

