సుల్తానాబాద్, వెలుగు: సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల కోసం ప్రజాప్రతినిధులను ప్రశ్నించే తత్వాన్ని ప్రజలు అలవర్చుకోవాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ ఊర చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా నిర్మించే పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు మౌనంగా ఉంటే సమస్యలు తీరవన్నారు. సుల్తానాబాద్‌లో శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. రోడ్లను వెడల్పు చేసి సీసీ రోడ్లుగా అభివృద్ధి చేశామని, సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేశామన్నారు.
మున్సిపల్ ఆఫీస్, ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్‌కు కొత్త బిల్డింగ్‌లు నిర్మిస్తామన్నారు. జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ బిరుదు రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత, స్థానిక కౌన్సిలర్ గాదాసు మంజుల, కమిషనర్ టి.రమేశ్, కాంగ్రెస్ లీడర్లు, మహిళలు పాల్గొన్నారు.

