అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లోకి ఎప్పుడంటే?

అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లోకి ఎప్పుడంటే?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. మే  16న  ఆగ్నేయ అరేబియన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతంలోని మెజారిటీ ప్రాంతాలతో పాటు... అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి రుతుపవనాలు  ప్రవేశించాయి.

గత ఏడాది మే 24వ తేదీనే కేరళను తాకిన రుతుపవనాలు... ఈ సంవత్సరం మే 26వ తేదీన అంటే నాలుగు రోజులు అటు ఇటుగా కేరళ తీరాన్ని తాకేందుకు పూర్తి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.రానున్న మూడు నాలుగు రోజులలో ఇవి మరింత పుంజుకోనున్నాయి. ఆగ్నేయ అరేబియన్ సముద్రం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించడంతో పాటు... అండమాన్ నికోబార్ దీవుల్లోని మిగిలిన భాగాలు, తూర్పు బంగాళాఖాతంలోకి ఇవి వేగంగా ప్రవేశించనున్నాయి.

ALSO READ : షిఖోపూర్ ల్యాండ్ డీల్, మనీ లాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు..

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే... మే 26న కేరళను తాకిన తర్వాత, జూన్ మొదటి వారంలో... అంటే జూన్ 5వ తేదీ లోపు నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఆ తర్వాత జూన్ 12 నాటికి... నాలుగు రోజులు అటు ఇటుగా తెలంగాణను తాకనున్నాయి.   దీంతో రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి, వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.