ఇండియా ఎప్పటికీ హిందూ దేశం కాదు: ప్రసాద్ మౌర్య

ఇండియా ఎప్పటికీ హిందూ దేశం కాదు: ప్రసాద్ మౌర్య

న్యూఢిల్లీ: ఇండియా హిందూ దేశమని, ఇక్కడున్న వాళ్లందరూ హిందువులేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ చేసిన కామెంట్లపై సమాజ్‌‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య మండిపడ్డారు. భారత్ ఎప్పటికీ హిందూ దేశం కాదన్నారు. దేశాన్ని మతానికి ఆపాదించడమేంటని ప్రశ్నించారు. దేశ రాజ్యాంగం లౌకికవాదం ఆధారంగానే రూపొందిందని శనివారం ట్వీట్ చేశారు. దేశంలోని ప్రజలందరూ భారతీయులేనని, అన్ని మతాలు,  సంస్కృతులకు రాజ్యాంగం ప్రాముఖ్యతను ఇచ్చిందన్నారు.