
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ సంస్థలో ఖాళీగా ఉన్న 3025 పోస్టుల భర్తీకి టీఎస్ ఎస్పీడీసీఎల్ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో పాటు విధివిధానాలను కూడా ప్రకటించింది. జూనియర్ లైన్‌మెన్(-2500), జూనియర్ పర్సనల్ ఆఫీసర్- (25), జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్-(500) పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. వివరాలకు http://tssouthernpower.cgg.gov.in లాగిన్ కావాలని సదరన్ డిస్కం వెల్లడించింది.