అయోధ్య కేసు విచారణకు 6 నెలల టైం ఇవ్వండి: స్పెషల్ జడ్జి

అయోధ్య కేసు విచారణకు 6 నెలల టైం ఇవ్వండి: స్పెషల్ జడ్జి

న్యూఢిల్లీ: రామజన్మభూమి, బాబ్రీ మసీదు భూవివాదం కేసులో విచారణను ముగించేందుకు మరో ఆరు నెలల గడువు కావాలని స్పెషల్ జడ్జి సుప్రీంకోర్టును కోరారు. తాను సెప్టెంబర్ 30న రిటైర్ అవుతున్నానని, బీజేపీ సీనియర్ నేతలు ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి ఇతరుల పాత్రపై విచారణను ముగించేందుకు సమయం కావాలని గత మేలో సుప్రీంకోర్టుకు ఆయన లేఖ రాశారు. సోమవారం ఈ కేసు జస్టిస్ ఆర్ ఎఫ్ నారిమన్  ఆధ్వర్యంలోని బెంచ్ ఎదుట విచారణకు వచ్చింది. ఈ కేసులో తీర్పు చెప్పేవరకు స్పెషల్ జడ్జి పదవీకాలాన్ని పొడిగించే అంశంపై ఈ నెల 19లోపు సమాధానం చెప్పాలని ఉత్తరప్రదేశ్ సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజకీయంగా సున్నితమైన ఈ కేసును రోజువారీ విచారణ చేపట్టి రెండేళ్లలో ముగించాలని సుప్రీంకోర్టు 2017 ఏప్రిల్ 19న ఆదేశించింది. వీవీఐపీ నిందితులపై నేర కుట్ర అభియోగాలపై మళ్లీ విచారణ జరపాలన్న సీబీఐ అభ్యర్థనను అనుమతించింది, రాజస్థాన్ గవర్నర్ గా ఉన్నందున కల్యాణ్ సింగ్ ను విచారణ నుంచి మినహాయించింది.