హైదరాబాద్ సిటీ, వెలుగు: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు గ్రేటర్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. దీంతో అభ్యర్థులు పరీక్ష రాసి, తిరిగి వెళ్లే సమయాల్లో ఎగ్జామినేషన్ సెంటర్ల నుంచి అన్ని రూట్లలో బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. బస్టాండ్లలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశామని, జేబీఎస్ లో జోనల్ కమ్యూనికేషన్ సెంటర్ ఫోన్ నం. 9959226160 అందుబాటులో ఉంటుందన్నారు. బస్సులకు సంబంధించి ఏ సమాచారం కోసమైనా అభ్యర్థులు ఈ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
