తిరుపతి- కాకినాడ స్టేషన్ల మధ్య 80 ప్రత్యేక రైళ్లు

తిరుపతి- కాకినాడ స్టేషన్ల మధ్య 80 ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతి- కాకినాడ టౌన్‌ స్టేషన్ల మధ్య 80 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది సౌత్ సెంట్రల్ రైల్వే. ఈ రైళ్లు వారానికి మూడు రోజులు అందుబాటులో ఉంటాయి. ఆగస్టు 1 నుంచి‌ నవంబర్‌ 1 వరకు ఈ రైళ్లు నడుస్తాయని చెప్పింది రైల్వే. తిరుపతిలో 07432 నంబరు గల రైలు ప్రతి ఆది, మంగళ, గురువారాల్లో సాయంత్రం 6.50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుకుంటుంది.

తిరిగి కాకినాడ టౌన్‌లో 07431 నంబరు గల రైలు ప్రతి సోమ, బుధ, శుక్ర వారాల్లో రాత్రి 9 గంటలకు బయల్దేరి ఉదయం 8.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైళ్లు రేణిగుంట, శ్రీకాళహస్తి గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్ల కోట స్టేషన్లలో ఆగుతాయి. వీటిలో స్లీపర్‌, జనరల్‌ బోగీలు ఉంటాయి.