అసోం డీఎస్పీ గా హిమాదాస్

అసోం డీఎస్పీ గా హిమాదాస్

భారత స్టార్‌ స్ప్రింటర్‌ హిమాదాస్‌ (21) అసోంలో డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని అసోం పోలీస్‌ శాఖ ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. పోలీస్‌ కావాలనేది తన చిన్ననాటి కలగా తెలిపారు హిమదాస్. అంతేకాదు తన తల్లి కూడా ఇదే కోరుకునేదని చెప్పారు. తన కల నెరవేరిందని అయితే అథ్లెట్‌గానే తన కెరీర్‌ను కొనసాగిస్తాని తెలిపారు హిమాదాస్‌.

హిమాదాస్‌ డీఎస్పీగా బాధ్య తలు స్వీకరించడంపై అసోం సీఎం సోనోవాల్‌ స్పందించారు. ఆమెకు అభినందనలు తెలుపుతూ ఈ నియామకం ద్వారా క్రీడారంగంలో రాణించాలనే ఇతర యువతకు హిమాదాస్‌ ఆదర్శంగా నిలుస్తుందన్నారు.