V6 News

వెస్టిండీస్ టూర్ : ధోనీకి రెస్ట్ ఇచ్చిన టీమిండియా

వెస్టిండీస్ టూర్ : ధోనీకి రెస్ట్ ఇచ్చిన టీమిండియా

ముంబై: వెస్టిండీస్‌ టూర్ కు వెళ్లే భారత టీమ్ ను ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఆదివారం సెలక్ట్ చేసింది. విండీస్‌ తో ఆగస్టు 3న ప్రారంభమయ్యే టూర్ లో భారత్‌ మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌ లో మ్యాచ్ లు ఆడనుంది. ఈ టూర్ కు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీనే మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

గాయంతో వరల్డ్‌కప్‌ టోర్నీ నుంచి వైదొలిగిన ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ టీ20, వన్డే జట్లలో చోటు దక్కించుకున్నాడు. మహేంద్రసింగ్‌ ధోనీ స్థానంలో రిషబ్‌ పంత్‌ ను వికెట్‌ కీపర్‌ గా సెలక్ట్ చేశారు. ధోనీ రెండు నెలలు విశ్రాంతి తీసుకున్న క్రమంలో రిషభ్‌ పంత్‌ కు అవకాశం దక్కింది.