నీట్ రెడీ ల్యాప్‌‌టాప్‌‌ను ఆవిష్కరించిన శ్రీచైతన్య

నీట్ రెడీ ల్యాప్‌‌టాప్‌‌ను ఆవిష్కరించిన శ్రీచైతన్య
  • ఏసర్, ఇంటెల్‌‌తో కలిసి అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ 

హైదరాబాద్, వెలుగు: దేశంలో మెడికల్ ప్రవేశాల కోసం నిర్వహించే ‘నీట్’ వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలోకి మారుతుండటంతో, ప్రముఖ విద్యాసంస్థ శ్రీచైతన్య విద్యార్థుల కోసం నీట్ రెడీ ల్యాప్‌‌టాప్‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలైన ఏసర్, ఇంటెల్ సంస్థలతో కలిసి శ్రీచైతన్య అనుబంధ సంస్థ ‘ఇన్ఫినిటీ లెర్న్’ ఈ ల్యాప్‌‌టాప్‌‌ను ఆవిష్కరించింది. మంగళవారం శ్రీచైతన్య విద్యాసంస్థల సీఈఓ, డైరెక్టర్ సుష్మ బొప్పన ఒక ప్రకటన విడుదల చేశారు.

విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ల్యాప్‌‌టాప్‌‌ను రూపొందించినట్టు తెలిపారు. ‘ఏసర్ యాస్పైర్ సిరీస్’ ల్యాప్‌‌టాప్ విద్యార్థుల నిరంతర అభ్యాసనానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. నీట్ ప్రిపరేషన్‌‌కు కావాల్సిన పూర్తి స్టడీ మెటీరియల్ ఇందులో ముందే లోడ్ చేయబడి ఉంటుందని పేర్కొన్నారు.

విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయడానికి ఐనా అనే ప్రత్యేక ఏఐ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. చాప్టర్‌‌‌‌వైజ్ ప్రాక్టీస్ టెస్టులతో పాటు, అసలు పరీక్షను తలపించేలా మాక్ టెస్టులు ఉంటాయని వివరించారు. లైవ్, రికార్డెడ్ క్లాసులను ఎప్పుడైనా వీక్షించే సౌకర్యం ఉంటుందని స్పష్టం చేశారు.