దక్షిణకాశీకి పోటెత్తిన భక్తులు.. శ్రీకాళహస్తీశ్వరుని ప్రాంగణం కిటకిట

 దక్షిణకాశీకి పోటెత్తిన భక్తులు.. శ్రీకాళహస్తీశ్వరుని ప్రాంగణం కిటకిట

దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తికి భక్తులు పోటెత్తారు.  సోమాపతి అమావాస్య విశేష పర్వదినాన ( జూన్​ 15) శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకొకేందుకు భక్తులు భారీగా రావడంతో.. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. మొదటి, రెండవ గోపురం నుండి వచ్చే భక్తులు క్యూ  లైన్లలో  భారీగా భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు.

 భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగు ఏర్పాటు చేశారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ధర్మ దర్శనానికి  దాదాపు మూడు గంటల సమయం పట్టింది. ప్రత్యేక దర్శనానికి గంట గంటన్నర సమయం పడుతుంది. 

 భక్తులకు త్రాగునీరు  అందుబాటులో ఉంచారు. వేసవి తాపం నుండి సేదతీరుటకు అధికారులు కూలర్లను  ఏర్పాటు చేశారు. ఈవో అందుబాటులో ఉండి భక్తులకు క్యూలైన్ల ఏర్పాటు చేశారు . ఈవో బి కే వెంకటేశ్వర్లు, ఆలయ చైర్మన్ కొట్టేసాయి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపర్​ ఇన్​డెంటెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు..భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా  పర్యవేక్షిస్తున్నారు.