ఫెర్నాండో సెంచరీ : శ్రీలంక స్కోర్ 338/6

ఫెర్నాండో సెంచరీ : శ్రీలంక స్కోర్ 338/6

వరల్డ్ కప్ ఫినిషింగ్ టచ్ ఇచ్చింది శ్రీలంక. సోమవారం వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారీ స్కోర్ చేసింది. ఊహించని రీతిలో చెలరేగిన లంక..నిర్ణీత 50 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 338 రన్స్ చేసింది.

అవిష్క ఫెర్నాండో (104) అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. కెరీర్‌లో అతడికిదే ఫస్ట్ సెంచరీ. కుశాల్‌ పెరీరా (64), లాహిరు తిరిమానె (45) రాణించడంతో విండీస్ కు చాలెంజింగ్ టార్గెట్ ను ముందుంచింది లంక. విండీస్ బౌలర్లలో జేసన్‌ హోల్డర్‌ 2 వికెట్లు తీశాడు.