జై శ్రీరాం : మధ్యాహ్నం 1 గంటలలోపే శ్రీరాముడికి ప్రసాదాలు పెట్టేయండి.. మీరు భోజనాలు చేసేయండి..!

జై శ్రీరాం : మధ్యాహ్నం 1 గంటలలోపే శ్రీరాముడికి ప్రసాదాలు పెట్టేయండి.. మీరు భోజనాలు చేసేయండి..!

హిందువుల ముఖ్యమైన పండుగల్లో శ్రీరామనవమి ఒకటి. శ్రీరామనవమి పండుగను ప్రతి పల్లె, పట్నంలో రేపు ( 2026 మార్చి 27)ఘనంగా నిర్వహించుకుంటారు.  మధ్యాహ్నం వరకే నవమి ఘడియలు ఉండటంతో శ్రీరామ నవమి పూజ చేసేందుకు ముహూర్తం ఏమిటి.. ఏ సమయంలో స్వామివారికి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించాలి .. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

 శ్రీరామనవమి తిథి... శ్రీరాముడు దుష్ట శక్తులను నాశనం చేసి ధర్మాన్ని స్థాపించడానికి విష్ణుమూర్తి తీసుకున్న ఏడవ అవతారం. హిందూ క్యాలెండర్ ప్రకారం, చైత్ర మాసంలో వచ్చే నవమి తిథి నాడు రామ నవమిని జరుపుకుంటారు.ఈ ఏడాది( 2026) చైత్రమాసంలో  నవమి తిథి మార్చి 26 మధ్యాహ్నం ప్రారంభమై మార్చి 27 మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా క్యాలెండర్లలో 26వ తేదీని శ్రీరామనవమిగా చూపించారు. భద్రాచలంలో రాములోరి కళ్యాణం 27వ తేదీగా ప్రకటించారు. 

పండితులు  ఏం చెప్పారంటే... 

హిందువులు.. సాధారణంగా, సూర్యోదయ సమయంలో నవమి తిథి వచ్చే రోజును రామ నవమిగా జరుపుకుంటారు. దీని ప్రకారం, పంచాంగ సూచనల ప్రకారం 2026, మార్చి 27, శుక్రవారం నాడు రామ నవమిని జరుపుకోవాలి. 

శ్రీరామనవమి  పూజా సమయం

శ్రీరామ నవమి నాడు శ్రీరాముడిని పూజించడానికి మధ్యాహ్నం ఉత్తమ సమయంగా పరిగణిస్తారు.శ్రీ రామ నవమి పూజ సమయం (మధ్య ముహూర్తం): మార్చి 27, 2026 ఉదయం 11.06 నుండి మధ్యాహ్నం 1.31 వరకు. ఈ రెండు గంటల సమయం శ్రీరాముడిని పూజించడానికి అత్యంత శక్తివంతమైన సమయంగా పరిగణిస్తారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కూడా అదే సమయంలో జరుగుతుంది. 

నవమి తిథి వివరాలు: 
 

  • నవమి తిథి  ప్రారంభం :  మార్చి 26న మధ్యాహ్నం 2.18 గంటలకు
  • నవమి తిథి  ముగింపు:  మార్చి 27న మధ్యాహ్నం 12.36 గంటలకు

పండితులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 1 గంటకల్లా స్వామివారికి నివేదన సమర్పించాలి.. ఆతరువాత హారతి ఇచ్చి.. స్వామి ప్రసాదాన్ని స్వీకరించి..ఎంచక్కా పిండి వంటలతో భోజనం చేయాలని పండితులు చెబుతున్నారు.  ఆ తరువాత సాయంత్రం  దేవాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించి.. తలంబ్రాల అక్షింతలు పెద్దలతో వేయించుకోవాలి.  

 శ్రీరామ నవమి వేడుకలలో భాగంగా భక్తులకు  పానం  అందించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. శ్రీరామనవమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. అది మనకు ధర్మ మార్గంలో నడవాలని నేర్పే ఒక పవిత్రమైన రోజు. అందుకే ఊరూ వాడా.. ప్రతి చోట శ్రీరాముని కళ్యాణం నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజు సీతారాములను సేవిస్తారు..