ప్రతి ఏటా చైత్ర శుద్ధ నవమి రోజు ఘనంగా జరుపుకునే పండుగ శ్రీ రామనవమి, శ్రీరాముడు జన్మించిన రోజు, సీతా దేవిని వివాహమాడిన రోజు కూడా ఇదే. రాజుగా పట్టాభిషిక్తుడైంది కూడా ఈ రోజే అని రామాయణ సారం. అందుకే ఈ రోజును భక్తులు శ్రీరామ నవమి' పేరుతో ఉత్సవంగా నిర్వహిస్తారు. ప్రజలంతా తమ దగ్గర్లోని దేవాలయాల్లో సీతారాముల కల్యాణం జరిపిస్తూ తమ భక్తిని చాటుకొంటారు.
శోభాయమానం.."సీతారామ కల్యాణం..
విష్ణుమూర్తి దశావతారాల్లో ఏడవడి రామావతారం దేవతల కోరిక మేరకు రావణ సంహారార్ధమై మానవ రూపంలో అవతరించిన దైవం శ్రీరాముడు దశరథ పుత్రునిగా, పరిపూర్ణ మానవుడిగా అవతరిస్తానని దేవ తలకు ఇచ్చిన మాట ప్రకారం విష్ణుమూర్తి. రాముడిగా, ఆదిశేషుడు లక్ష్మణడిగా. శంఖుచక్రములు భరత శత్రఘ్నులుగా అవతరిస్తే, శ్రీ మహాలక్ష్మి జనకుడి కూతురు సీతాదేవిగా అవతరించారు.
సకల సుగుణ సంపన్నుడు.
మనిషి ఎలాంటి సుగుణాలు కలిగి ఉండాలో, ఆచరించి చూపించాడు. శ్రీరాముడు అందుకే ఆయన
ఆదర్శప్రాయుడు పితృవాక్యపరిపాలకుడు.తల్లిదండ్రుల మాటను గౌరవించే పుత్రుడిగా, సోదరులను ప్రేమించే అన్నగా, ఏకపత్నీవ్రతంతో భార్యకు విలువిచ్చే భర్తగా ధర్మపరిరక్షకుడైన పాలకుడిగా, స్నేహానికి ప్రాణం ఇచ్చే మీత్రు డిగా గురువును పూజించే శిష్యుడిగా ఇలా అన్నింట్లోనూ ఉత్తమమైన విలువలు రాముడి.. సొంతం. రాజుగా ఆయన పాలన చిరస్మరణీ యం.
క్రమశిక్షణ, ధైర్యం. దయ కలిగిన వాడు. వేదాంతి. సకల శాస్త్రాల్లో ఆరితేరిన పండితుడు. అందగాడు. సకల కార్యాలను చక్కబెట్టగల సమర్థుడు. అసూయ లేనివాడు. క్రోధాన్ని జయించిన వాడు. ప్రశాంతచిత్తుడు. ఇలాంటిసుగుణాలెన్నో కలిగినటువంటి వాడు రాముడు. అందుకే రాముడు పూజనీయుడు.
వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి నాడు పున దృ పక్షత్రం, కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు జన్మించాడు. అందుకే ప్రతిఏటా చైత్రశుద్ధ నవమి రోజు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు దేవాలయాల్లో శ్రీరామ నవమి వేడుకులు జరపడం ఆనవాయితీ. ఈ నట దర్భంగా మన తెలుగు రాష్ట్రాలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిపిస్తారు.
సీతారాములు, లక్ష్మణ భరత శత్రఘ్నులతో కూడిన ప్రతిమల్ని ఈ వేడుకలకు ఉపయోగిస్తారు. దేవతామూర్తుల ప్రతిమల్ని పూమాలలతో అలంకరించి పూలు, నైవేద్యాలు సమర్పించి, శాస్త్రోక్షంగా వివాహం. జరిపిస్తారు. శ్రీరామ అష్టోత్తరం శ్రీరామరక్షా స్తోత్రం శ్రీరామాష్టకం శ్రీరామ సహస్రం వంటి స్తోత్రాలు పరిస్తారు. సన్నజాజి, తామర, కమ లాకాయలు వంటివి నివేదిస్తారు. శ్రీరాముడికి ఎంతో ప్రీతిపాత్రమైన వడపప్పు, పానకం తప్పని సరిగా నైవేద్యంగా సమర్పిస్తారు. దేవాలయాల్లో కల్యాణం తర్వాత అన్నదానం నిర్వహిస్తారు.
ఇంటింటా వేడుకలు
ప్రతి ఇంట్లోనూ శ్రీరామనవమి రోజు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఈ సందర్భంగా సూర్యోద యానికి ముందే నిద్రలే ఇంటిని శుభ్రం చేసుకొని తలంటు స్నానం చేయాలి. పూజా మందిరం, గడపకు పసుపు, కుంకుమ రాయాలి. ఇంటిముందు. అందమైన ముగ్గులు వేయాలి. పూజగదిలోని సీతారాముల చిత్రపటానికి పూజలు చేసి, శక్తి. మేర పూలు, పండు, నైవేద్యం సమర్పించాలి. ఈ రోజు పసుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిదని పురాణాలు చెప్పున్నాయి.
వడపప్పు–శాస్త్రం
శ్రీరామ నవమి సందర్భంగా చేసే వడపప్పు-పానకం వెనుక శాస్త్రీయ దృక్పథం కూడా ఉంది. పెసరపప్పుతో చేసే వడపప్పు, ఎండా కాలంలో వడదెబ్బ నుంచి రక్షించే చలువ గుణాన్ని కలిగి ఉంటుంది. పానకంలో వాడే మిరియాలు యాలకులు ఈ కాలంలో వచ్చే గొంతు వ్యాధుల నుంచి కాపాడతాయి. జీర్ణశక్తి నివృద్ధి చేస్తాయి.
