V6 News

అమరావతిలో ఎస్‌‌ఆర్‌‌‌‌ఎం క్వాంటం సెంటర్‌‌‌‌

అమరావతిలో ఎస్‌‌ఆర్‌‌‌‌ఎం క్వాంటం సెంటర్‌‌‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: వరల్డ్  క్వాంటం డే సందర్భంగా ఎస్‌‌ఆర్‌‌‌‌ఎం యూనివర్సిటీ–ఏపీ భారతదేశంలోనే మొదటి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ (క్యూఆర్‌‌‌‌ఎఫ్‌‌)ని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఈ సెంటర్‌‌‌‌ను ఏర్పాటు చేసింది. దీనిని  ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అమరావతి క్వాంటం వ్యాలీ ప్రాజెక్ట్​లో భాగంగా 1ఎస్‌‌,  1క్యూ అనే రెండు టెస్టింగ్ బెడ్‌‌లను  ఎస్‌‌ఆర్ఎం  ఏర్పాటు చేసింది. ఈ సెంటర్‌‌‌‌లో  100 క్యూబిట్‌‌ ప్రాసెస్‌‌ వరకు పరీక్షించొచ్చు.

ఇక్కడ కొత్త టెక్నాలజీలను ప్రాక్టికల్‌‌గా పరీక్షించడం, ధ్రువీకరించడం, బెంచ్‌‌మార్క్ చేయడం, సర్టిఫై చేయడం సాధ్యమవుతుంది. ఇందుకు సంబంధించి అవసరమైన పరికరాలు, సిస్టమ్స్‌‌ను అమర్చారు.  అంతేకాకుండా   కొత్తగా అభివృద్ధి చేస్తున్న క్వాంటం ప్రాసెసర్లు, క్యూబిట్‌‌ సిస్టమ్స్ పనితీరును రియల్‌‌టైమ్‌‌లో పరీక్షించొచ్చు.   ఈ కార్యక్రమంలో డిపార్ట్‌‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ అభయ్ కరండికర్‌‌, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్‌‌‌‌ అజయ్ కుమార్ సూద్‌‌, డీఆర్‌‌‌‌డీఓ, ఐఐటీలు, టీఐఎఫ్‌‌ఆర్‌‌‌‌ శాస్త్రవేత్తలు, స్టార్టప్‌‌ వ్యవస్థాపకులు పాల్గొన్నారు.