కొడంగల్, వెలుగు: వడ్ల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని స్టేట్పోలీస్ హౌసింగ్కార్పొరేషన్చైర్మన్గురునాథ్రెడ్డి సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను పొందాలని చెప్పారు. బుధవారం కొడంగల్మార్కెట్యార్డులో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. తహసీల్దార్విజయ్కుమార్, పీఏసీఎస్ చైర్మన్శివకుమార్, మార్కెట్చెర్మన్ అంబయ్యగౌడ్, ఏఓ లావణ్య పాల్గొన్నారు.
