సింధు విజయం వెనుక ఇద్దరు కోచ్‌లు

సింధు విజయం వెనుక ఇద్దరు కోచ్‌లు

ఛాంపియన్లను అందించేందుకే వచ్చా : సింధు కోచ్​ హ్యున్​

హైదరాబాద్‌‌‌‌:  వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో  తెలుగు షట్లర్‌‌‌‌ పీవీ సింధు  గోల్డ్‌‌‌‌  నెగ్గడంలో చీఫ్‌‌‌‌ కోచ్‌‌‌‌ గోపీచంద్‌‌‌‌తో పాటు కొరియా కోచ్‌‌‌‌ కిమ్‌‌‌‌ జి హ్యున్‌‌‌‌ పాత్ర కూడా కీలకం. ఈ విషయాన్ని సింధునే చెప్పింది. చివరి రెండు ఫైనల్స్‌‌‌‌తో  పోల్చితే ఈ టోర్నీలో సింధు ఆటలో  కొత్తదనం  కనిపించింది. గోల్డ్‌‌‌‌ తెచ్చిన ఆ కొత్త  ఆటకు కారణం కిమ్‌‌‌‌. కొన్ని నెలలుగా గోపీచంద్‌‌‌‌ అకాడమీలో  తెలుగు షట్లర్‌‌‌‌ ఆటకు మెరుగులుదిద్ది చారిత్రక స్వర్ణం అందుకునేలా చేసిందామె.

అయితే, తాను డబ్బు సంపాదించడం కోసం ఇండియా రాలేదని, సింధు లాంటి చాంపియన్లను అందించడం కోసమే వచ్చానని కిమ్‌‌‌‌ గర్వంగా చెబుతోంది. స్పోర్ట్స్‌‌‌‌ అథారిటీ ఆఫ్‌‌‌‌ ఇండియా (సాయ్‌‌‌‌) తరఫున గోపీచంద్‌‌‌‌ అకాడమీలో ఏప్రిల్‌‌‌‌ నుంచి హ్యున్‌‌‌‌ కోచ్‌‌‌‌గా పనిచేస్తోంది. తన వర్క్‌‌‌‌ను ఎంజాయ్‌‌‌‌ చేయకపోతే ఈ జాబ్‌‌‌‌ను ఎప్పుడో వదిలేసేదానిని  ఆమె ఆంటోంది.  అదే సమయంలో తన ట్రైనీలు కూడా వర్క్‌‌‌‌ను ఎంజాయ్‌‌‌‌ చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పింది. ఒకుహరాతో ఫైనల్లో సింధు పర్ ‌ఫెక్ట్‌‌‌‌ గేమ్‌‌‌‌ ఆడిందని కిమ్‌‌‌‌ అభిప్రాయపడింది. సింధు గోల్డ్‌‌‌‌ నెగ్గిన తర్వాత తన ఆనందానికి అవధుల్లేకుండా పోయిందని చెప్పింది.  ఇకపై  కూడా ఆటలో ప్రతీ అంశాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెడతామన్న కిమ్‌‌‌‌.. ఒలింపిక్స్‌‌‌‌ ముంగిట ఎట్టి పరిస్థితుల్లోనూ రిలాక్స్‌‌‌‌ అవకూడదని తెలిపింది.