ఈ ఆటగాడిని అరెస్ట్ చేశారు.. బైక్ పై ఎంట్రా ఆ రొమాన్స్..!

ఈ ఆటగాడిని అరెస్ట్ చేశారు.. బైక్ పై ఎంట్రా ఆ రొమాన్స్..!

బెంగళూరులో ఓ వ్యక్తి అమ్మాయిని తన ఒడిలో పెట్టుకుని ప్రమాదకరంగా బైక్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోను గమనించిన పోలీసులు వారిద్దరినీ గుర్తించారు. మహిళ బైకర్ ఒడిలో ఒకవైపు కూర్చొని, అతని మెడ చుట్టూ చేతులు పట్టుకుంది. ఉత్తర బెంగళూరులోని హెబ్బాల్ ఫ్లైఓవర్‌పై ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ  ఈ సంఘటన మే 17న బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రోడ్డులో జరిగింది.బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు బైక్ నంబర్ ప్లేట్, సీసీటీవీ విజువల్స్ ఆధారంగా ఆ వ్యక్తి, మహిళను గుర్తించారు.

 బెంగళూరులో ఓ వ్యక్తి మహిళను తన ఒడిలో పెట్టుకుని మోటార్‌సైకిల్‌పై వెళుతున్న  వీడియో వైరల్‌గా మారడంతో డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని నగర పోలీసులు ఆదేశించారు. ఈ వీడియోను బెంగుళూరు ట్రాఫిక్ పోలీసులు ఎక్స్‌లో కూడా పంచుకున్నారు. ఈ వీడియో వైరల్​ కావడంతో నెటిజన్లు స్పందించారు.  థ్రిల్​విన్యాసాలకు రోడ్దు వేదిక కాదు... మీతో సహా అందరూ సురక్షితంగా ఉండాలి.. కాస్తంత బాధ్యతగా రైడ్​ చేద్దాం.. ఒకరు ఎక్స్​ పై ట్వీట్​ చేశారు.  భద్రత గురించి ఆలోచించండి.. ... బెంగళూరు ఆదరించే నగరం... గందరగోళానికి ఇది స్థలం కాదు.. రోడ్డుపై సురక్షితంగా ప్రయాణించి.. ప్రాణాలు కాపాడుకోండి అని మరొకరు కామెంట్​ చేశారు. 

ఆ అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేయలేదు.. ఆమెను కూడా అరెస్ట్​ చేయండి ఒకరు వ్యాఖ్యానించారు. ఇద్దరీకీ శిక్షపడాల్సిన అవసరం ఉందని మరొకరు రాశారు. వీరు  క్రమశిక్షణారాహిత్యం, బాధ్యతారహిత వ్యక్తులు అని ఇంకొకరు అన్నారు. మూడో వ్యక్తి ఫైన్​ విధించడమే కాదు... అతని డ్రైవింగ్​ లైసెన్స్​ రద్దు చేసి .. జైల్లో పెట్టాలి అని రాశారు.  ఇంకా పోలీసులు చేసిన పనిని కొంతమంది నెటిజన్లు ప్రశంసించారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు ( వార్త రాసే సమయం వరకు) 22 వేల కంటే ఎక్కువ వీక్షణలు వచ్చాయి.  356 లైక్​లు.. 50కిపైగా రీట్వీట్​ వచ్చాయి.   బైక్​  డ్రైవర్‌పైనే కాకుండా వారిద్దరిపైనా చర్యలు తీసుకోవాలని పలువురు పోలీసులను కోరారు. 

బైకర్‌ను బెంగళూరులోని శ్యాంపూరాలోని ఎంవీ లేఅవుట్‌లో నివాసం ఉంటున్న సిలంబర్సన్ (21)గా గుర్తించారు.  రోడ్​ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించిన వారిని గుర్తించామని పోలీసులు తెలిపారు. గతంలో ఇలాంటి ఘటనలకు ఏమైనా పాల్పడ్డారా అనే విషయాన్ని కూడా ఆరా తీస్తున్నట్లు తెలిపారు.  వాహనాన్ని స్వాధీనం చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు నిందితులపై తదుపరి చర్యలకు ఉపక్రమించారు అతనిపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 279, 184 (ప్రమాదకరమైన డ్రైవింగ్), 189 (పబ్లిక్ రోడ్లపై రేసింగ్ లేదా వేగంగా నడపడం), 129, మోటారు వాహనాల చట్టంలోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోనున్నారు అధికారులు.