ఏం జరిగింది.. ? : సింగపూర్ విమానంలో.. గాల్లోనే గందరగోళం.. ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

ఏం జరిగింది.. ? : సింగపూర్ విమానంలో.. గాల్లోనే గందరగోళం.. ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

ఎయిర్ లైన్స్ విమానంలో  ప్రమాదం జరిగింది. లండన్ నుంచి  సింగపూర్ వెళ్తున్న ఎయిర్‌లైన్స్ విమానం..  గాల్లో ఉండగానే భారీ కుదుపులకు లోనైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 30 మందికి గాయాలయ్యాయి. దీంతో విమానాన్ని మే 21(  మంగళవారం) బ్యాంకాక్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.

బోయింగ్ 777-300ER విమానం 211 మంది ప్రయాణికులు,  18 మంది సిబ్బందితో సింగపూర్‌కు బయల్దేరగా అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడిందని..విమానంలో  ఒక ప్రయాణీకుడు మరణించాడని సింగపూర్ ఎయిర్ లైన్స్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

మరణించిన ప్రయాణీకుడి కుటుంబానికి  ఎయిర్ లైన్స్ సంతాపం తెలిపింది. గాయపడిన వారికి  అవసరమైన వైద్య సహాయం అందించడానికి తాము థాయ్‌లాండ్‌లోని స్థానిక అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు.