Nagarjuna, Puri Jagannadh: మరోసారి నాగార్జునతో పూరి మూవీ.. ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడట

Nagarjuna, Puri Jagannadh: మరోసారి నాగార్జునతో పూరి మూవీ.. ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడట

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్(Puri Jagannadh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీ చాలా తక్కువ సమయంలో సినిమాలు చేసి విడుదల చేయడంలో ఆయన మాస్టర్. సినిమాను మొదలుపెట్టిన రోజే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ఆయన స్పెషాలిటీ. అందుకే ఆయన్ని ఆడియన్స్ ప్రేమగా డైనమిక్ డైరెక్టర్ అని పిలుస్తారు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్టు లేక సతమతమవుతున్న పూరి.. రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆతరువాత లైగర్ సినిమాతో ఘోర పరాజయాన్ని చవి చూశారు. 

ఇప్పుడు మరోసారి తనకు హిట్ ఇచ్చిన హీరో రామ్ తో మళ్ళీ అదే సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నాడు ఈ దర్శకుడు. దాంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. అయితే.. డబుల్ ఇస్మార్ట్ సినిమా తరువాత పూరి చేయబోయే సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. పూరి తన తరువాతి సినిమాను టాలీవుడ్ కింగ్ నాగార్జునతో ప్లాన్ చేస్తున్నాడట. ఇటీవలే ఆయన్ని కలిసి లైన్ కూడా వినిపించాడట. 

పూరి చెప్పిన లైన్ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట నాగార్జున. ప్రస్తుతం నాగార్జున శేఖర్ కమ్ముల హీరో ధనుష్ తో చేస్తున్న కుబేర సినిమాలో కీ రోల్ చేస్తున్నాడు. ఆ తరువాత రజినీకాంత్ దర్శకుడు లోకేష్ కానగరాజ్ కాంబోలో వస్తున్న కూలి సినిమాలో కూడా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తరువాత నాగార్జున, పూరి కాంబోలో సినిమా మొదలుకానుంది. ఇప్పటికే ఈ కాంబోలో శివమణి, సూపర్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో కొత్త సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.