తమిళ హీరో విశాల్(Vishal), మాస్ చిత్రాల దర్శకుడు హరి(Hari) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ రత్నం(Rathnam). మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెంచిన ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించారు. కానీ, విడుదల తరువాత మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది రత్నం మూవీ. దీంతో.. విశాల్ కెరీర్ లో మరో ప్లాప్ మూవీగా మిగిలిపోయింది ఈ మూవీ.
ఇక అప్పటినుండి రత్నం సినిమా ఓటీటీ గురించి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా రత్నం సినిమా ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. అవును.. ఈ సినిమాను మే 23 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్టీమింగ్ కానుంది. దీంతో విశాల్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మరి థియేటర్స్ లో ప్లాప్ గా నిలిచిన రత్నం సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
