అరే ఏంట్రా బాబూ... బిస్కట్లతో బజ్జీలంట..

అరే ఏంట్రా బాబూ... బిస్కట్లతో బజ్జీలంట..

స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు తమ వ్యాపారాన్ని పెంచుకొనే పనిలో పడ్డారు.. కొత్త కొత్త వంటలతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.. నిత్యం ఏదొక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు మాత్రం కోపాన్ని తెప్పిస్తాయి .. సోషల్ ఓ వెరైటీ డిష్ వీడియో వైరల్ అవుతుంది..అదే కొత్తిమీర బజ్జీ .. పకోడీలు చెయ్యడం మనం వినే ఉంటారు.. ఓరియో బిస్కెట్స్ తో బజ్జీలను చెయ్యడం ఎలా అనే సందేహం కూడా వస్తుంది.. ఇదేలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.. మరి ఆలస్యం ఎందుకు ఒకసారి చూసేద్దాం పదండీ..

పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటే ఇదే కాబోలు. ఓ వ్యాపారి బుర్రకు తట్టిన ఐడియా.. ఆహార ప్రియులకు కొత్త రకం రుచిని పరిచయం చేసింది. అదే.. ఈ ఒరియో (Oreo) బిస్కట్ బజ్జీ. ఔనండి.. నిజం! ఆ వ్యాపారి ఒరియో బిస్కట్లతో బజ్జీలు వేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు. ‘అరె ఏంట్రా ఇదీ’.. మరీ బిస్కట్లతో బజ్జీలు ఏంట్రా అని అనుకుంటున్నారా? కానీ, అక్కడి కస్టమర్లు మాత్రం అవంటే చాలా ఇష్టమట. అయితే, ఇదేదో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చేస్తున్న గిమ్మిక్కులు అని కూడా అనుకోలేం. 

రకరకాల వెరైటీగా ఉండే బజ్జీలను మనం చూస్తూనే ఉంటాం.. ఏదైనా స్పైసిగా ఉంటే బాగుంటుంది.. వీటిలో ఎన్ని రుచులు ఉండటం వల్ల ఎక్కువగా వీటిని తినడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.. తక్కువ ధర కావడంతో సాయంత్రం అయితే చాలు ఎక్కువ మంది వీటిని తినడానికి ఇష్టపడతారు.. అయితే ఇప్పుడు చూస్తే ఓరియో బిస్కెట్ బజ్జీ వీడియో తెగ వైరల్ అవుతుంది..ఒక ప్రాంతపు ఆహారాన్ని.. మరొక ప్రాంతం వారు తినడం ప్రారంభించారు. ఆ ప్రయోగాన్ని చూసి నెటిజన్లు బాబోయ్ ఇదేమి ఆహారం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ టిఫిన్ సెంటర్ వ్యక్తి బజ్జీల పిండిని అంతా సిద్ధం చేసి బిస్కెట్స్ ను బజ్జి పిండిలో ముంచి కాగే నూనెలో బజ్జీలుగా వేస్తారు. అంతే వాటిని సగానికి కట్ చేసి వేడి వేడిగా సర్వ్ చేస్తారు.. దాని రుచి ఎలా ఉందో తెలియదు కానీ ఆహా, ఓహో అని లోట్టలేసుకోని తింటారు.. ఈ వింత వంటకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అవుతోంది. వీడియోను కూడా లైక్ చేసారు.. మొత్తానికి వీడియో ట్రెండ్ అవుతుంది..