ఈ ఎద్దు మసాల దోశ కస్టమర్.. రోజూ రెండు దోశలు తినకుండా కదలదు.. వీడియో వైరల్

ఈ ఎద్దు మసాల దోశ కస్టమర్.. రోజూ రెండు దోశలు తినకుండా కదలదు.. వీడియో వైరల్

ఒక ఎద్దు మసాల దోశ కస్టమర్ గా మారిపోయింది. రోజూ వచ్చి రెండు దోశలు తింటే గాని హోటల్ ముందు నుంచి కదలదు. ఆ ఎద్దును నంది బాబాగా పిలుచుకునే హోటల్ ఓనర్.. ఎద్దు రాంగనే వేడి వేడిగా రెండు మసాలా దోశలు తినిపించి పంపిస్తాడు. ఈ ఓనర్ చేసే ఈ చిన్న పనితో ఆయన హోటల్ ఇప్పుడు ఇండియాలోనే ఫేమస్ అయిపోయింది. ఎద్దుకు, ఓనర్ కు ఉన్న అనుబంధం ఏంటో.. నంది బాబా గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలేంటో తెలుసుకుందాం. 

జార్ఖండ్ లోని ఒక ఫుడ్ స్టాల్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఒక ఎద్దు హోటల్ ముందుకు వచ్చి నిల్చుని.. వేడి వేడి దోశలు తిని వెళ్లే వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. దోశలు వేసి తినిపించే హోటల్ ఓనర్ ఇప్పుడు ప్రశంసలు అందుకుంటున్నాడు.

  • రెగ్యులర్ కస్టమర్:

ఎద్దు రెగ్యులర్ కస్టమర్ గా మారిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ప్రతీరోజు ఒకే టైమ్ కి సైలెంట్ గా వచ్చి ఎద్దు అక్కడ నిలబడుతుంది. ఎద్దును అక్కడి నుంచి కసిరి పంపకుండా.. వేడి వేడి దోశ వేసి తినిపిస్తుంటాడు ఓనర్. వీడియోలో చూపినట్లుగా.. దోశ అయ్యే వరకు ఎద్దు సైలెంట్ గా.. డిస్టర్బ్ చేయకుండా నిల్చుంటుంది. ఓనర్ దోశ తీసుకురాగానే దగ్గరికి వచ్చి లాగించేస్తుంది. ఓనర్ చేస్తున్న పనికి.. ఆ హోటల్ ఫేమస్ అయిపోయింది. ఆ ఏరియాలో ఉన్న కస్టమర్లు క్యూ కట్టారు. 

►ALSO READ | వామ్మో.. 48 డిగ్రీల సెల్సియస్ ఎండ.. జైసల్మేర్‎ను మించిపోయిన బండా జిల్లా

ఎద్దుపై ఓనర్ చూపిన మమకారం.. ఆయన ఫేమస్ అయ్యేలా చేసింది. చాలా మంది దోశ తినటానికి ఆ హోటల్ కు వస్తుంటారు. కొందరైతే ఎద్దు దోశతినటాన్ని చూడాలని ప్రత్యేకంగా దూరప్రాంతాల నుంచి హోటల్ దగ్గరకు చేరుకుంటున్నారు. ఓనర్ మంచి పనికి గుర్తింపు ఇది అని అంటున్నారు. 

  • సోషల్ మీడియాలో కామెంట్స్:

సోషల్ మీడియాలో చాలా  వరకు పాజిటివ్ కామెంట్స్ తో నిండిపోతున్నాయి. ఎద్దుకు నమ్మకస్తుడిగా కార్డు అవ్వాలని.. బెస్ట్ కస్టమర్ అవార్డు ఇవ్వాలని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఫుడ్ స్టాల్ కు ఎద్దు అన్ అఫీషియల్ బ్రాండ్ అబాసిడర్ గా మారిపోయినట్లు కొందరు అంటున్నారు. 

హిందూ సంప్రదాయంలో ఇది ఒక భాగం అని కిందరు కామెంట్స్ చేస్తున్నారు. హిందూ సంప్రదాయంలో ఆహార పదార్థాలను ముందుగా గోవులకు పెట్టి ఆ తర్వాత తినడం ఒక ఆచారంగా ఉంటుందని.. ఆ ఓనర్ కు ఆ అదృష్టం దక్కిందని చెబుతున్నారు. 

కొందరు దీన్ని తప్పుపడుతున్నారు కూడా. పశులకు దోవలు మొదలైన ఆహార పదార్థాలు పెట్టడం వాటి ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు. హైజీనిక్ గా లేకపోయినావాటి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని అంటున్నారు.