లక్నో: దేశంలో ఎండలు ఎక్కువగా కొట్టే రాష్ట్రమనగానే అందరికి టక్కున రాజస్థాన్ గుర్తుస్తోంది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఎడారి ఉండటంతో నార్మల్‌గానే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. కానీ దేశంలో గరిష్ట ఉష్ణోగ్రత నమోదైన నగరం రాజస్థాన్ లేదు. దేశంలో హయ్యెస్ట్ టెంపరేచర్ నమోదైన నగరం ఉత్తరప్రదేశ్‌లో ఉంది. యూపీలోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఉన్న బాందా జిల్లాలో మంగళవారం (మే 19) 48.2 డిగ్రీల సెల్సియస్ రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది.
తద్వారా రాజస్థాన్‌ను కూడా దాటేసి దేశంలోనే అత్యంత వేడి ప్రాంతంగా బాందా జిల్లా మారింది. దీంతో ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌ను కూడా క్రాస్ చేసేంతా రికాస్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు బందా జిల్లాలో ఎందుకు నమోదు అవుతున్నాయనేది చర్చనీయాంశంగా మారింది.
బండా జిల్లా అగ్నిగోళంలో ఎందుకు మారుతోంది..?
సంవత్సరాల తరబడి స్థానికంగా జరిగిన పర్యావరణ విధ్వంసం బండా జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవడానికి ప్రధాన కారణమంటున్నారు పరిశోధకులు, వాతావరణ నిపుణులు. బుందేల్ ఖండ్ ప్రాంతంలో మైనింగ్, బ్లాస్టింగ్, నదీ క్షీణత, భూగర్భ జలాల పతనం, అటవీ నిర్మూలన వంటి పలు కారణాలతో బండా జిల్లాలో పర్యావరణం నాశనమవుతోంది. ఫలితంగా ఆ జిల్లాలో రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
►ALSO READ | నటి ట్విషా శర్మ మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం అవసరం లేదు: భోపాల్ కోర్టు కీలక తీర్పు
