నటి ట్విషా శర్మ మృతదేహానికి రీ పోస్ట్‎మార్టం అవసరం లేదు: భోపాల్ కోర్టు కీలక తీర్పు

నటి ట్విషా శర్మ మృతదేహానికి రీ పోస్ట్‎మార్టం అవసరం లేదు: భోపాల్ కోర్టు కీలక తీర్పు

భోపాల్: నటి ట్విషా శర్మ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్విషా శర్మ మృతదేహానికి రీ పోస్ట్‎మార్టం నిర్వహించాలన్న ఆమె కుటుంబ సభ్యుల అభ్యర్థనను భోపాల్ లోకల్ కోర్టు తిరస్కరించింది. ట్విషా డెడ్ బాడీకి సెకండ్ అటాప్సీ అవసరం లేదని కోర్టు పేర్కొంది. 

మాజీ మిస్‌ పుణె, నటి ట్విషా శర్మ అనుమానస్పద రీతిలో మరణించిన విషయం తెలిసిందే. 2026, మే 12న భోపాల్‎లోని కటారా హిల్స్ ప్రాంతంలోని తన అత్తవారింట్లో ట్విషా శవమై కనిపించింది. తమ కూతురిని ఆమె భర్త, అత్తమామలపై హత్య చేశారని ట్విషా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, పోస్ట్‎మార్టం రిపోర్టులో ట్విషాది ఆత్మహత్య అని తేలింది. ట్విషా మరణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తోన్న పేరెంట్స్ కూతురి డెడ్ బాడీకి రీ పోస్ట్ మార్టం నిర్వహించాలని భోపాల్ లోకల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. \

►ALSO READ | నటి ట్విషా శర్మ మృతి కేసులో కీలక మలుపు.. రంగంలోకి సీబీఐ..!

ఈ పిటిషన్‎పై బుధవారం (మే 20) విచారణ చేపట్టిన భోపాల్ కోర్టు.. ట్విషా మృతదేహానికి రెండోసారి పోస్ట్ మార్టం నిర్వహించాలన్న ఆమె తల్లిదండ్రులను విజ్ఞప్తిని తిరస్కరించింది. రీ పోస్ట్ మార్టం కోసం డిమాండ్ చేస్తూ ట్విషా డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో గత 8 రోజులుగా భోపాల్ ఎయిమ్స్ లోని ట్విషా డెడ్ బాడీ ఉంది. రీ పోస్ట్ మార్టానికి భోపాల్ కోర్టు ఒప్పుకోకపోవడంతో ట్విషా పేరెంట్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.