‘జేఎన్ టీయూ మెరిట్ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లిస్తాం’

‘జేఎన్ టీయూ మెరిట్ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లిస్తాం’

కూకట్​పల్లి, వెలుగు: జేఎన్​టీయూ విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్టూడెంట్స్​ ప్రొటెక్షన్ ​ఫోరం ఆధ్వర్యంలో మెరిట్ రివార్డ్​ ప్రోగ్రాంను శుక్రవారం ప్రారంభించారు. అర్హులైన విద్యార్థులకు వచ్చే సెమిస్టర్​నుంచి సెమిస్టర్ ​పరీక్ష ఫీజును చెల్లిస్తామని ఫోరం అధ్యక్షుడు రాహుల్​నాయక్​తెలిపారు. పరీక్షల్లో 9.0 లేదా అంతకంటే ఎక్కువ సీజీపీఏ సాధించినవారు లేదా 95 శాతం కంటే ఎక్కువ హాజరు నమోదు చేసిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు.