- విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాకు ఎస్టీయూటీఎస్ వినతి
హైదరాబాద్, వెలుగు: రాబోయే విద్యా సం వత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యలపై చర్చించేందుకు తక్షణమే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సదానందం గౌడ్, జుట్టు గజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణాను కలిసి వినతిపత్రం అందించారు.
అకాడమిక్ క్యాలెండర్, విద్యా సంస్కరణలు, టీచర్ల బదిలీలు, ప్రమోషన్లపై చర్చించకపోవడంతో సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరుగుతోందని తెలిపారు. పక్క రాష్ట్రం ఏపీలో ప్రతి వారం సమావేశాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. స్పందించిన ఆమె.. విద్యాశాఖ డైరెక్టర్‌తో చర్చించి, సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు

