సుమంత్ ప్రభాస్ హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సమ్మర్‌లో ‘గోదారి గట్టుపైన’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా, సెప్టెంబర్‌లో ‘రోమాంచకం’ మూవీతో రాబోతున్నాడు. తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. ‘రాజు వెడ్స్ రాంబాయి’తో దర్శకుడిగా గుర్తింపును తెచ్చుకున్న సాయిలు కంపాటి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై పుస్కూర్ రామ్ మోహన్ రావు, భరత్ నారంగ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సోమవారం ఈ చిత్రం సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హీరో అడివి శేష్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా, దర్శకుడు శేఖర్ కమ్ముల కెమెరా స్విచాన్ చేశారు. సాయిలు కంపాటి దర్శకుడిగా తన రెండో సినిమాను రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ కలిసిన ఓ హార్ట్‌వార్మింగ్ రస్టిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నట్టు, స్మాల్ టౌన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రేమకథతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు మంచి ప్రాధాన్యం ఉంటుందని మేకర్స్ తెలియజేశారు. హీరోయిన్, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌ను అనౌన్స్ చేసి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు చెప్పారు.
